ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారిని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మరియు శాసనమండలి సభ్యులు తలశిల రఘురాం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శాసనమండలి సభ్యులు తలశిల రఘురాం ను ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. అనంతరం ఆలయ వేదపండితులు శాసనమండలి సభ్యులు తలశిల రఘురాం కు వేదాశీర్వచనాలను అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాలను, చిత్రపటాన్ని అందచేశారు.
Prajavartha Online Telugu News