Breaking News

గృహం అంటే ఒక మనిషి సుదీర్ఘకాలం పడిన కష్టానికి, సంతోషానికి సజీవ సాక్ష్యం !!

-మంత్రి జోగి రమేష్

రామవరపుమోడీ (బంటుమిల్లి), నేటి పత్రిక ప్రజావార్త :
ఇల్లు అంటే కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మించిన కట్టడం మాత్రమే కాదని.. గృహం అంటే ఒక మనిషి సుదీర్ఘకాలం పడిన కష్టానికి, సంతోషానికి సజీవ సాక్ష్యం లాంటిదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు
శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు ఆయన పెడన నియోజవర్గం బంటుమిల్లి మండలం ఆముదాలపల్లి సచివాలయ పరిధిలోని రామవరపుమోడీ గ్రామంలో 553 గృహాలకు సంబంధించి గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పర్యటించారు గ్రామ ప్రజలు,స్థానిక నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
గ్రామంలో కాగిత వెంకటేశ్వరమ్మ, మట్టా రేణుక, చిల్లిముంత కృష్ణకుమారి, గూడవల్లి అనంతలక్ష్మి, మరీదు ఎంకమ్మ, కాగిత సంధ్యారాణి, పోసిన పద్మ, మాన్యం వెంకటేశ్వరరావు, పరసా నాగ వెంకట కుమారి, పరసా మంగమ్మ, కాగిత నాగలక్ష్మి, కాగిత మద్ది రావమ్మా తదితరులు నివసించే ప్రతి గడపకు వెళ్ళిన మంత్రి ఆ కుటుంబ సభ్యులతో మమేకమవుతూ, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా వాస్తవ లబ్ధిదారులకు అందుతున్నాయా తెలుసుకోవడం, అందకపోతే కారణాలు తెలుసుకొని అర్హులందరికీ అందించడమే ధ్యేయంగా ప్రతి గడపకు వెళుతున్నామన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పక నెరవేరుస్తున్నామని మంత్రి జోగి రమేష్ గ్రామస్తులకు తెలిపారు.
తమ గ్రామంలో తరచూ విద్యుత్ అంతరాయ సమస్య తమను ఇబ్బంది పెడుతుందని, 3 ఫేజ్ కరెంటు ఊరంతా అవసరమని పలువురు రామవరపు మోడీ గ్రామస్తులు మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే, తమ గ్రామంలో రైతులకు డి- ఫారం భూములు మాత్రమే ఉన్నాయని తమకు శాశ్వత హక్కు పట్టాలు మంజూరు చేయాలని మంత్రిని కొందరు రైతులు అభ్యర్థించారు. తక్షణమే స్పందించిన మంత్రి జోగి రమేష్ బంటుమిల్లి తహసిల్దార్ సత్యనారాయణ, స్థానిక విఆర్ఓ సిహెచ్ శ్రీనివాసరావును అక్కడకు పిలిపించి, రామవరపు మోడీ గ్రామంలో ఎన్ని ఎకరాలు భూమి ఉందో సర్వే చేయించారా అని అడిగారు. ఈ గ్రామంలో 773 ఎకరాల భూమి ఉందని, 450 మంది రైతులు ఉన్నారని సంబంధిత అధికారి జవాబు ఇచ్చారు. మంత్రి జోగి రమేష్ రైతులతో మాట్లాడుతూ, తప్పకుండా మీ సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా గ్రామంలో కాగిత నాగలక్ష్మి అనే మహిళ మంత్రి వద్ద తన కుమారుని ఆరోగ్య పరిస్థితిని వివరించారు కాగిత సాయి అనంత కుమార్ ఇటీవల పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ ట్రాక్టర్ అకస్మాత్తుగా తిరగబడడంతో డ్రైవింగ్ సీట్లోంచి కిందకు జారిపడి నడుం విరగొట్టుకున్నాడని, మెరుగైన చికిత్స కోసం పలుచోట్ల అప్పులు చేసి దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు చేశామని వెల్లడించారు. తాము ఖర్చు పెట్టిన డబ్బులు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నామని ఇప్పటివరకు ఏ కొద్దిపాటి నగదు తమకు అందలేదని ఆమె ఆవేదన చెందారు. మంత్రి జోగి రమేష్ ఆ క్లస్టర్ లోని వాలంటీర్ ను ఈ విషయమై ప్రశ్నించగా, గాయపడిన వ్యక్తి పేరు ఆరోగ్యశ్రీలో లేదని అందుకే సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు కాలేదని జవాబు చెప్పారు. మంత్రి వెంటనే తన వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ను పిలిచి ఆ బాధితుని పేరు వివరాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు. కాగిత అయ్యప్ప అనే గ్రామస్తుడు తన కష్టాన్ని చెప్పుకున్నాడు రెండు సంవత్సరాల కుమారుడు చాణిక్య ఉదర సంబంధిత ఇబ్బంది కారణంగా శస్త్ర చికిత్స చేయించారని, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఈ విషయమై స్పందించిన మంత్రి జోగి రమేష్ స్థానిక మెడికల్ ఆఫీసర్ వి. జయశ్రీ పిలిపించి ఆ చిన్నారి ఆరోగ్య వివరాలు తనకు తెలియజేయాల్సిందిగా సూచించారు.
అనంతరం మంత్రి జోగి రమేష్ రామవరపుమోడీ గ్రామస్తులతో మాట్లాడుతూ, మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా మూడున్నరేళ్లలో 31 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేసి ఒక అన్నగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిండు మనసుతో అక్కచెల్లెమ్మలకు అందచేశారన్నారు. ఆ ఇంటి స్థలాల విలువ అక్షరాలా రూ.26 వేల కోట్ల విలువ ఉంటాయన్నారు. అందులో ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలయ్యాయిన్నారు. గృహ నిర్మాణాలు పూర్తయ్యాక మౌలిక వసతులతో కలిపి ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన ఆస్థిని పెట్టినట్లు అవుతుందని, ఇంత మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరంతా హృదయపూర్వకంగా ఆశీర్వదించాలని మంత్రి జోగి రమేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో రామవరపుమోడీ గ్రామ సర్పంచ్ ఏకుల శివ, బంటుమిల్లి జడ్పిటిసి మలిశెట్టి వెంకటరమణ, బంటుమిల్లి ఎంపీపీ వెలివెల చినబాబు,మండల పార్టీ అధ్యక్షుడు మలిశెట్టి రాజబాబు, ఎంపీడీవో జె. స్వర్ణ భారతి, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు జోగి వెంకటేశ్వరరావు, ఏఎంసి చైర్మన్ పాలడగు బాబూరావు, యువజన నాయకుడు అబ్దుల్ మతిన్, వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆరోగ్య కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *