విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మీషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో)కు 2022కు సంబంధించి రెండు స్కోచ్ అవార్డులు లభించాయి. పవర్, ఎనర్జీ విభాగంలో నెట్వర్క్ మెయింటెనెన్స్, మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కు స్కోచ్ అవార్డ్`గోల్డ్, పవర్ డిమాండ్ అంచనా కోసం రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌కు స్కోచ్ అవార్డు`సిల్వర్ లభించాయి. వర్చ్యువల్ విధానంలో శుక్రవారం జరిగిన ఈ అవార్డుల ప్రకటన సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, జేఎండీ ఐ.పృథ్వితేజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News