జగ్గయ్యపేట/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా రంగానికి ముఖ్యంగా గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలను చేరుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ అన్నారు. జగ్గయ్యపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, బాలుర వసతి గృహాన్ని బధవారం రాష్ట్ర ఎస్టీ కమీషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ వసతి గృహాంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిచ్చి, ఆయా వర్గాలు అత్యునత స్థాయికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేదవారు విద్యకు దూరం కాకూడదని నాడు-నేడు కార్యక్రమం ద్వారా గిరిజన పాఠశాలలు, వసతి గృహాలలో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారన్నారు. ప్రపంచ నలుమూలల మన రాష్ట్ర విద్యార్థులు ఉన్నత స్థానాలలో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలంచి ఇంగ్లీష్ మీడియంలో బోదన జరిగేలా చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్ర ఎస్టీ కమీషన్ రాజ్యాంగ బద్దమైన సంస్థ అని గిరిజనుల హక్కుల ప్రర్యవేక్షణ కాపాడవలసిన భాధ్యత తీసుకుంటుందన్నారు. విద్యా రంగంలో ముఖ్యమంత్రి సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర ఎస్టీ కమీషన్ ముఖ్యంగా నాలుగు అంశాలపై దృష్టి సారిస్తుందన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, నిరుద్యోగులకు ఉదోగ్య ఉపాధి అవకాశాలు కల్పించి ఆయా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావడం తదితర అంశాలు ఉంటాయన్నారు. గతంలో జాతీయ స్థాయిలో ఎస్టీ కమీషన్ ఒకటే ఉండేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఎస్టీ కమీషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గిరిజనులకు సామాజిక న్యాయం, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా వర్గాలు అభివృద్ది చెందేలా తోడ్పాటును అందిస్తుందన్నారు. గిరిజనులకు కమీషన్ అండగా వుంటుందని కమీషన్ ఏర్పాటు అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి ఆర్థిక స్థితిగతులను పరిశీలించడం జరిగిందన్నారు. గిరిజన సంక్షేమానికి ఏర్పాటు చేసిన కమీషన్‌కు ఆయా వర్గాలు తమ కష్టాలను, బాదలను తెలుపుకోవచ్చునని కమీషన్ ఎల్లప్పుడు అండగా వుంటుందని సభ్యులు వడత్యా శంకర్ నాయక్ అన్నారు.
విద్యార్థులతో మమేకమైన కమీషన్ సభ్యులు:
గురుకుల పాఠశాలలోని 8,9,10 తరగతి విద్యార్థుల పాఠ్యాంశాలను పరిశీలించి తెలుగు, ఇంగ్లీష్, సాంఫీుక శాస్త్రం పాఠాలను విద్యార్థులతో చదివించి వారి పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువు విషయంలో రాజీపడకుండా చదువుపైనే దృష్టి సారించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. మీ తల్లిదండ్రులు వ్యవసాయ, నీరుపేద కుటుంబాలకు చెందిన వారని బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవడం ద్వారా సంతోషిస్తారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు`నేడు, అమ్మఒడి, వంటి పథకాల ద్వారా కోట్లాది రూపాయలను విద్యకై ఖర్చు చేస్తుందన్నారు. ఆయా వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టుల బర్తీకి చర్యలు తీసుకుంటానన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోదన చేయాలన్నారు.
మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలన:
మధ్యాహ్న భోజన పథకంలో ఆహార పదార్థాల తయారీకి వినియోగించే వస్తువుల స్టాక్‌ను పరిశీలించి, నాణ్యతలో రాజీ పడకూడదన్నారు. విద్యార్థులతో కలిసి సహ పంక్తి భోజనం చేశారు. వసతి గృహాంలో నిరుపయోగంగా ఉన్న ఆర్వో ప్లాంట్‌ను పరిశీలించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పర్యటనలో కమిషన్ సభ్యునితో పాటు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి యం. రుక్మాంగదయ్య, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, తహాశీల్థార్ సిహెచ్‌వో నాగేశ్వరరావు, యంఇవో రవీందర్, కౌన్సిలర్ మనోహర్, స్థానిక నాయకులుఉన్నారు.
Prajavartha Online Telugu News