-ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ప్రజా స్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలి..
-రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా స్వామ్య పురోగమణానికి నాంది పలికే శక్తిగల ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజా స్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాన్యశ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ కోరారు.
13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేతంలో నిర్వహించిన ఓటర్ల దినోత్సవ వేడుకలకు గౌరవనీయులు బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేస ికార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు అమ్యులమైనదని ప్రజాస్వామ్య సామాజంలో పౌరుణికి ఉన్న అత్యంత శక్తివంతమైన అహింస సాదనం ఓటు హక్కు అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుటి నుండి మన రాజ్యాంగం పౌరులందరికి సమాన ఓటు హక్కును కల్పించిందన్నారు. అర్హత, మతం, కులం, జాతి వంటి వివక్షతలకు తావులేకుండా ఓటు హక్కును పవిత్ర హక్కుగా పరిగణిస్తారన్నారు. ఆరోగ్య కరమైన ప్రజాస్వామ్యం కోసం దేశంలోని యువత అత్యంత చిత్త శుద్దితో ఓటు హక్కును వినియోగించుకుని ఇతరలకు స్పూర్తిగా నిలవలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి ప్రభావం లేకుండా దేశాన్ని ప్రపంచ దేశాలలో శక్తివంతమైన దేశంగా నిలబెట్టడంలో ఎన్నికల వ్యవస్థ కీలక పాత్ర అన్నారు. 1950వ సంవత్సరంలో ఏర్పాటైన భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక రోజైన జనవరి 25వ తేది జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం అనందదాయకమన్నారు. పౌరులను చైతన్యవంతులను చేసి ఓటర్లుగా నమోదు చేసే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఏడాది నథింగ్ లైక్ ఓటింగ్` ఐ ఓటు ఫర్ ష్యూర్ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల ప్రధాన కార్యాలయాలు 175 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రధాన కార్యాలయాలు, 27,077 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు ఓటర్ల దినోత్సవాన్ని జరపడాన్ని అభినందిస్తున్నానన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానన్నారు. పౌరులు తమ పేరులను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడం ద్వారా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు. పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ఓటు హక్కు కలిగిన ఓటర్ల యొక్క ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేయడంతో పాటు కొత్త ఓటర్లగా నమోదుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఎన్నికల ప్రక్రియ గురించి ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేయాలన్నారు. యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి ఓటు హక్కును పొందలన్నారు. పౌరుల ఓటు హక్కుపై కళాశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
పేజి`2
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్. జవహర్‌రెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటర్లగా నమోదై ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై స్థిరమైన విశ్వాసం కలిగి స్వచ్ఛ న్యాయమైన శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ఎన్నికలలో జాతి కుల మతాలకు తావులేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఓటర్లగా తమ పేర్లను నమోదు చేసేందుకు ప్రజలలో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో తమ మొబైల్ నెంబర్లను నమోదు చేసుకుని ఇపిఐసిని డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును భారత ఎన్నికల సంఘం కల్పించడం జరిగిందన్నారు. బూత్ లెవల్ అధికారులు సూపర్‌వైజర్లు వారి పరిధిలో ఓటర్లుగా నమోదు కానివారిని గుర్తించి ఓటర్లగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా మట్లాడుతూ అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారంతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత ఓటర్లకు ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు ఫారం`బి ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 68.57 శాతం మంది ఓటర్ల నుండి ఆధార్‌ను సేకరించడం జరిగిందన్నారు. 2022 సంవత్సరంలో 8 లక్షల 39 వేల 164 మందిని కొత్తగా ఓటర్ల జాబితాలో చేర్చాడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 45,951పోలింగ్ స్టేషన్‌లో 3 కోట్ల 99 లక్షల 84 వేల 868 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 18 సంవత్సరాలు నిండి 19 సంవత్సరాలు నిండిన 3,03,225 మంది యువ ఓటర్లకు ఓటు హక్కును కల్పించామన్నారు. రాష్ట్రంలో పునరావృతం మరణించిన వలస వచ్చిన వారికి సంబంధించి 15,90,802 మంది ఓటర్లను జాబితా నుండి తొలగించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నికల జాబితా తయారీలో సహకరించిన అధికారులకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సిబ్బందికి ధాన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
అనంతరం ఓటర్ల నమోదు ఎన్నికల జాబిత రూపొందించడంలో ఉత్తమ సేవలందించిన కళాశాల విద్య కమీషనర్ పి భాస్కర్, ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్‌బాబు, చిత్తూరు జిల్లా కలెక్టర్ యం హరినారాయణ, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లికార్జున, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఆరోగ్యశ్రీ సిఇవో యం.ఎన్. హరేంద్ర ప్రసాద్,ఎస్‌పిఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా జిల్లా పోలీస్ సుపరింటెండెంట్ సిహెచ్ విజయరావు, శాసనమండలి డిప్యూటి సెక్రటరి కె.రాజకుమార్, ఆర్ వనితరాణి, ఏఆర్‌వోలు, బిఎల్‌వోలను రాష్ట్ర గవర్నర్ ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం జ్ఞాప్తికలను అందజేశారు. అనంతరం ‘‘భారతదేశ పౌరులమయిన మేము ప్రజాస్వాయ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్చాయుత, నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం బాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని’’ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా నలంద కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలుఅలరించాయి. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియ, ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, సబ్ కలెక్టర్ అతిధి సింగ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, రాజకీయపార్టీల ప్రతినిధులు పి గౌతమ్‌రెడ్డి, వర్ల రమాయ్య, వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News