-పొగాకు పై అఖిల భారత పొగాకు నెట్వర్క్ ప్రాజెక్ట్ (భారత వ్యవసాయ పరిశోధనా మండలి)
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పొగాకు పై అఖిల భారత నెట్వర్క్ ప్రాజెక్ట్ XII వ గ్రూప్ సమావేశాలు జనవరి 27, 2023 న రాజమండ్రి లోని ఐసిఏఆర్ -కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ లో ప్రారంభించబడినవి. ఐసిఏఆర్ – సి టి ఆర్ ఐ డైరెక్టర్ మరియు AINPT ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ M. శేషు మాధవ్ నేతృత్వంలో ఈ రెండు రోజుల సాంకేతిక సమావేశాలను నిర్వహిస్తోంది. డాక్టర్ తిలక్ రాజ్ శర్మ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్ సైన్సెస్), భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్), న్యూఢిల్లీ ముఖ్య అతిథిగా మరియు డాక్టర్ ఆర్.కె. సింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (వాణిజ్య పంటలు), ఐసిఏఆర్, న్యూఢిల్లీ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి గా హాజరయ్యారు.
పంటల సాగులో రైతులు ఎదుర్కొనే పలు సమస్యలకు పరిష్కారాలను కనుగొని వివిధ వ్యవసాయ పరిశోధనలకు కేంద్ర బిందువుగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి రైతు ప్రయోజనార్ధం పనిచేస్తుందని డాక్టర్ తిలక్ రాజ్ శర్మ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్ సైన్సెస్), ICAR, న్యూఢిల్లీ తెలిపారు. అధిక దిగుబడులు ఇచ్చే స్వల్ప కాలిక రకాలను అభివృద్ధి చేసి పొగాకు పరిశోధనలలో విప్లవాత్మక మార్పులు తేవాలని కోరారు. వాతావరణం లోని ప్రతికూలతను, చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను రూపొందించడంలో శ్యాస్త్రవేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విత్తనోత్పత్తిని పెంచి ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాన్ని అందేలా చేయాలని సూచించారు. పొగాకు పంట ద్వారా వచ్చే ఆదాయం రెండింతలు పెరిగిందని ఇప్పటికే రుజువైనందున, రైతు ప్రయోజనార్ధం విజయగాథలను నమోదు చేయాలని సూచించారు. పొగాకు క్యూరింగ్ కోసం శక్తి వనరుగా సౌర శక్తి ని సమర్ధవంతంగా వినియోగించడం తద్వారా కలప వాడకంపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చునని తెలిపారు. సి టి ఆర్ ఐ భారత దేశ వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బయో టెక్నాలజీ, మోలెక్యూలర్ జన్యు ప్రజనన ద్వారా విడుదలైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు వద్దకు చేర్చాలని డాక్టర్ తిలక్ రాజ్ శర్మ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్ సైన్సెస్), ICAR, న్యూఢిల్లీ తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ పరిశోధనా కార్యక్రమాల పునరుద్ధరణ దిశగా సాగుతున్నందున, పొగాకుతో పాటు పసుపు, మిరప, ఆముదం మరియు అశ్వగంధలో పంటకోత అనంతర యాజమాన్యం మరియు విలువ జోడింపుపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు.
తన అధ్యక్ష ప్రసంగంలో, డాక్టర్ ఎం. శేషు మాధవ్ ప్రముఖులకు స్వాగతం పలుకుతూ AINPT పరిశోధన విజయాలు, పొగాకు ఉత్పత్తి, దిగుబడి అంతరాలు, ఎగుమతి సామర్థ్యం మరియు దేశ ఖజానాకు రాబడిపై కూడా ఆయన వివరించారు.
ఈ సందర్భంగా ఈ క్రింది 12 ప్రచురణలను ప్రముఖులు విడుదల చేశారు.
1. AINPT అన్నుల్ రిపోర్ట్ 2021-22
2. రీసెర్చ్ అచిఎవెమెంట్స్ అండ్ వర్క్ ప్లాన్ 2022
3. సక్సెస్ స్టోరీస్ అఫ్ AINPT
4. స్టేటస్ పేపర్ -ఇండియన్ బీడీ టొబాకో
5. స్టేటస్ పేపర్ – పిక్క టొబాకో ఇన్ ఒడిశా
6. స్టేటస్ పేపర్ – రస్టిక టొబాకో ఇన్ ఇండియా
7. మొబైల్ ఆప్ ఆన్ గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఫర్ ఇండియన్ నాన్-ఎఫ్ సి వి టొబాకో
8. ఐ సి ఏ ఆర్ -సి టి ఆర్ ఐ అన్నుల్ రిపోర్ట్ 2022
9. సి టి ఆర్ ఐ @ 75 ఇయర్స్
10. ఐ సి ఏ ఆర్ -సి టి ఆర్ ఐ న్యూస్లెటర్ జులై -డిసెంబర్ 2022
11. లీఫ్ క్వాలిటీ అసెస్మెంట్ అఫ్ ఎఫ్ సి వి టొబాకో
12. టొబాకో సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీ : సక్సెస్ స్టోరీ అఫ్ 3 డికేడ్స్
ICAR-CTRI ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వై. సుబ్బయ్య ధన్యవాదంతో ప్రారంభ కార్యక్రమం ముగిసింది.
మొదటి టెక్నికల్ సెషన్ కు అధ్యక్షత డాక్టర్ టి.ఆర్. శర్మ, DDG (CS) మరియు సహ-అధ్యక్షుడు డా. R.K. సింగ్, ADG (CC) మరియు డాక్టర్ M. శేషు మాధవ్ వహించారు. వివిధ సాంకేతిక సెషన్‌లకు సబ్జెక్ట్ నిపుణులు డా. ఆర్. లక్ష్మీనారాయణ, మాజీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, AICRPT; డాక్టర్ వి.ఆర్.ఎం. రావు, Ex-HOD, క్రాప్ ప్రొడక్షన్, CRRI, కటక్; డాక్టర్ జె.ఎ.వి. ప్రసాద రావు, Ex-HOD, క్రాప్ కెమిస్ట్రీ & సాయిల్ సైన్స్, CTRI, రాజమండ్రి మరియు Dr. U. శ్రీధర్, Ex-HOD, క్రాప్ ప్రొటెక్షన్, CTRI, రాజమండ్రి అధ్యక్షత వహించారు. AINPTకి చెందిన 14 కేంద్రాల శాస్త్రవేత్తలు, విభాగాల అధిపతులు, ICAR-CTRI శాస్త్రవేత్తలు, పొగాకు బోర్డు అధికారులు, వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 95 సభ్యులు పాల్గొన్నారు.
టెక్నికల్ సెషన్స్‌లో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌లందరూ విభాగాల వారీగా పరిశోధన ఫలితాలను వివరించారు. AINPT కేంద్రాల వారీగా సమీక్ష నిర్వహించబడింది మరియు AINPT యొక్క భవిష్యత్తు సాంకేతిక కార్యక్రమం ఖరారు చేయబడింది.
రేపటి కార్యక్రమం 28 జనవరి 2023
CTRI పరిశోధనా క్షేత్రం, కాతేరు మరియు రైతు క్షేత్రాలకు DDG (CS), ADG (CC), డైరెక్టర్ ICAR- CTRI మరియు ఇతర శాస్త్రవేత్తల సందర్శన
పొగాకు, వాణిజ్యం మరియు పరిశ్రమలతో పరస్పర చర్చ
ప్లీనరీ సెషన్
ప్రయోగశాలల సందర్శన
Prajavartha Online Telugu News