Breaking News

సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా టూర్ డైరీ ఫాలో అవ్వాలి

-278వ వార్డు సచివాలయంలో ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు శాచ్యురేషన్ పద్ధతిలో జరగాలని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా రాజీవ్ నగర్లోని 278వ వార్డు సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్జీలు స్వీకరించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు. వారి దైనందిన విధులు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రజా సమస్యల పరిష్కారం నిర్ణీత గడువులోగా జరగాలని ఆదేశించారు. సంక్షేమ క్యాలెండర్ పై ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. శానిటరీ సెక్రటరీ, పారిశుద్ధ్య సిబ్బంది టూర్ డైరీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని.. చెత్త సేకరణ వాహనం ప్రతి ఇంటికి వెళ్లేలా చూడాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఎమినిటీస్ సెక్రటరీ నిరంతరం పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్న క్రమంలో.. ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు స్టేటస్ ను వివరించాలన్నారు. అనంతరం సచివాలయ పరిధిలో ఆరోగ్యశ్రీ కార్డులపై ఆరా తీసిన ఆయన.. ఫీవర్ సర్వే క్రమంతప్పకుండా జరిగేలా చూడాలని సూచించారు. అలాగే దోమలు వ్యాప్తిచెందకుండా ప్రతిఇంటి వద్ద ఫాగింగ్ నిర్వహించాలన్నారు. సచివాలయ కార్యదర్శులలో మహిళ పోలీస్ పాత్ర కీలకమని.. కనుక ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మల్లాది విష్ణు చెప్పారు. ఎక్కువ మంది మహిళలచే దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించినందుకుగానూ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే చొరవ పెట్రోలింగ్ లోనూ.. విద్యాలయాలలో నిర్వహించే అవగాహన కార్యక్రమాలలోనూ చూపాలన్నారు. గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ లక్ష్యసాధన కోసం ప్రతిఒక్క ఉద్యోగి కృషి చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట జోనల్ కమిషనర్ సృజనా, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షులు పసుపులేటి యేసు, కన్వీనర్లు తిరుపతిరావు, సాయిలలిత, నాయకులు మోదుగుల గణేష్, ఉద్ధంటి శ్రీను, సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *