-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ అప్పులు, వడ్డీల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందని, 2019తో పోలిస్తే ఎపీ అప్పులు దాదాపు రెండిరతలయ్యాయనిÑ ఎపీ అప్పు ఇప్పటికి రూ.4.42 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సాక్షాత్తూ పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక (అప్పుల) మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఏపీ అప్పు కేవలం రూ.1.35 లక్షల కోట్లు మాత్రమే అని ఇటీవల ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన వివిధ కార్పొరేషన్‌లు, తదితరాల ద్వారా చేసిన అప్పులతో కలిపి దాదాపు రూ.10 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రతి నెలా ఒకటో తేదీకి ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పెన్షన్‌ల చెల్లింపులు కూడా ప్రతి నెలా సక్రమంగా చెల్లించకపోవడంతో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏపీ అప్పులు, వడ్డీల చెల్లింపులపై నిజా నిజాలు వెల్లడిరచాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ‘అప్పుచేసి పప్పుకూడు’ పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి అటకెక్కింది. నూతన పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుండి తరలిపోతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల పేరుతో దాదాపు రూ.1.72 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. గత మూడున్నరేళ్లుగా పెండిరగ్ బిల్లులు రూ.1,50,000 కోట్లుగా ఉన్నాయి. నాన్ గ్యారంటీ రుణాలు మరో రూ.88 వేల కోట్లకు పైగా ఉన్నాయి. కార్పొరేషన్ల రుణ వివరాలు తెలపాలని కాగ్ పదేపదే అడిగినప్పటికీ జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. జగన్ సర్కార్ బడ్జెట్‌లో పొందుపరచిన అప్పుల కంటే బడ్జెటేతర అప్పులు ఎక్కువ చేస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం ఇప్పటికే ఎపీ రుణ పరిమితి దాటిపోవడం ప్రమాదకరమైన విషయం. అందినకాడికి అప్పులు చేయడం, కేంద్రం విధించే విషమ షరతులకు తలొగ్గి ప్రజలపై పలు రకాల పన్నులు వేయడమే పనిగా పాలన సాగిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎపీ ఖజానాకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మొత్తంమీద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎపీని దివాళా దిశగా నడిపిస్తున్నారు.
ఈ పరిస్థితులలో ఎపీ అప్పులు, వడ్డీల చెల్లింపుల నిజానిజాలను ప్రజలకు వెల్లడిరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తక్షణమే వీటిపై శ్వేతపత్రం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News