Breaking News

పేదలు సొంతింటిలో ఉగాది వేడుకలను జరుపుకునేలా నిర్మాణాలను పూర్తి చేయండి..

-ఉగాది రోజున 16 వేల సామూహిక గృహ ప్రవేశాలకు ఇళ్లను సిద్దం చేయండి..
-నిర్మాణం తుది దశలో ఉన్న లబ్దిదారులతో ముఖముఖి మాట్లాడండి..
-సమస్యలను పరిష్కరించి గృహ నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోండి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిర్మాణం తుది దశలో ఉన్న లబ్దిదారులతో ముఖముఖి మాట్లాడి వారికి ఎదురైన సమస్యలను పరిష్కరించడం ద్వారా మార్చి 22న 16 వేల సామూహిక గృహ ప్రవేశాల లక్ష్యాన్ని పూర్తి చేసి గృహాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
జిల్లాలో జగనన్న గృహ నిర్మాణాలు, నాడు`నేడు పనుల ప్రగతి, జగనన్నకు చెబుదాం సమస్యల పరిష్కారం పై స్థానిక కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జాయింట్‌కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో జగనన్న కాలనీలలో నిర్మిస్తున్న గృహాలలో మార్చి 22వ తేది ఉగాది పర్వదినం రోజున సుమారు 16 వేల 347 గృహలలో లబ్దిదారులతో గృహ ప్రవేశాలు జరిపించాలని లక్ష్యంగా నిర్థేశించుకున్నామన్నారు. ఇప్పటికే 7,276 గృహ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మరో 9071 గృహాలు పూర్తి చేయవలసి వుందన్నారు. వీటిలో 2,807 గృహాల నిర్మాణం తుది దశలో ఉన్నాయన్నారు. తుది దశ నిర్మాణంలో ఉన్న గృహాలకు చెందిన లబ్దిదారులతో వెంటనే ముఖముఖి మాట్లాడి నిర్మాణం పూర్తి చేయడంలో వారికి ఎదురైన సమస్యలను గుర్తించాలన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి సాధ్యమైనంత త్వరలో నిర్మాణాలను పూర్తి చేసి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. 3,768 గృహాలు రూప్‌ లెవల్‌ దశలో ఉన్నయని, 2,496 గృహాలు రూప్‌ లెవల్‌ నుండి రూప్‌ కాస్టింగ్‌ దశకు చేరుకోవడం జరిగిందన్నారు. రూప్‌ లెవల్‌ రూప్‌ కాస్టింగ్‌ లెవల్‌లో ఉన్న గృహా నిర్మాణాలను పూర్తి చేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు పశ్చిమ సెంట్రల్‌ నియోజకవర్గాల లబ్దిదారులకు కేటాయించిన లే అవుట్లలో ప్రారంభించవలసిన గృహలు, మండలాలు, మున్సిపల్‌ పరిధిలోని లేఅవుట్లలో ప్రారంభించవలసిన గృహా నిర్మాణాలను పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్థేశించుకోవాలన్నారు. ప్రతి వారం 500 రూప్‌ లెవల స్థాయిలోని నిర్మాణాలను రూప్‌ కాస్టింగ్‌ స్థాయిలోకి తీసుకురావాలన్నారు. గృహ నిర్మాణాల లక్ష్యాలను సాధించండలో అలసత్వం వహించే మండల స్పెషల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ కమీషనర్లు, యంపిడివోలు, హౌసింగ్‌ ఏఇలతో కూడిన టీమ్‌ సభ్యులు భాధ్యత వహించవలసి వస్తోందని కలెక్టర్‌ హెచ్చరించారు.
నాడు`నేడు కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపడుతున్న అదనపు తరగతి గదులు, కాంపౌడ్‌ వాల్స్‌, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల నిర్మాణాలను వివిధ దశలలో చేపడుతున్నామన్నారు. జిల్లాలో 587 పాఠశాలలో 250 అదనపు తరగతి గదులు, 166 కాంపౌడ్‌ వాల్స్‌, 391 టాయిలెట్లు, 319 వంటగదుల నిర్మాణ పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిర్మాణాలను పూర్తి చేసేందుకు విద్యా శాఖ, ఇంజనీరింగ్‌, సమగ్ర శిక్ష అభియాన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పనులను వేగవంతం చేసి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ పెండిరగ్‌ లేకుండా పూర్తి చేయాలన్నారు. ఇంకనూ పంపిణీ చేయవలసిన పెండిరగ్‌ పత్రాలపై అందుబాటులో లేని లబ్దిదారులకు సమాచారం అందించి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. లంక భూముల లీజుకు సంబంధించి రెన్యూవల్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ అన్నారు.
జగనన్నకు చెబుదాం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 27 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ఇందులో మున్సిపల్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ 5 పంచాయతీరాజ్‌ 5 గ్రామ వార్డు సచివాలయం 4 పోలీస్‌ 3 హౌసింగ్‌ 2 పౌరసరఫరాలు , వక్ఫ్‌బోర్డ్‌, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, మైన్స్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి, సర్వే లాండ్‌ రికార్డు, జలవనరులు శాఖలకు చెందిన ఒక్కొక్క అర్జీలు ఉన్నాయన్నారు. ఆయా శాఖల అధికారులు అర్జీలకు సంబంధించి సమస్యలను సత్వరమే పరిశీలించి నివేధికను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో హౌసింగ్‌ పిడి శ్రీదేవి, డిఇ రవికాంత్‌, డిఇవో సివి రేణుక, కలెక్టరేట్‌ భూ విభాగ సూపరిండెంట్‌ యం దుర్గాప్రసాద్‌, జిల్లాకు చెందిన మండల స్పెషల్‌ ఆఫీసర్లు యంపిడివోలు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *