Breaking News

యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఖురానిక్ స్టడీస్ 8 వార్షిక ఖురాను కంఠస్త పోటీల ఫైనల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర ఖురాన్ బోధనల ద్వారా జీవితంలొ సాఫల్యత లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటిస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.ఇక్బాల్ అహమ్మద్ ఖాన్ పెర్కొన్నారు . ఆదివారం  విజయవాడ ఆటోనగర్ టెక్నీషియన్స్ హల్ లో యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఖురానిక్ స్టడీస్ 8 వార్షిక ఖురాను కంఠస్త పోటీల ఫైనల్ కార్యక్రమాన్ని అయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఖురానిక్ స్టడీస్ చైర్మన్ మొహమ్మద్ దావూద్ అద్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటిస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.ఇక్బాల్ అహమ్మద్ ఖాన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మరుతున్న సాంకేతిక పరిజ్ఞానం తో అనేక ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరిగినాక , అరచేతితో ఇంటర్నెట్ వచ్చేసాక విద్యార్థిని విద్యార్థులు వాటికి బానిసైపుతున్నారని అవేదన వ్యక్తం చేశారు . పర్యవసానంగా నైతిక విలువల పతనం ప్రారంభమయ్యిందన్నారు. సమాజంలోని బాంధవ్యాలు కూడా దెబ్బతింటున్నాయన్నారు. అనేక రుగ్మతలకు పరిష్కారము వున్న దివ్య ఖురాన్ ను ఆశ్రయించాల్సిన అవసరం ఉందన్నారు . యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఖురానిక్ స్టడీస్ ఈ తరుణంలో గురుతర బాద్యతను తీసుకుని 8 ఏళ్ళుగా పవిత్ర ఖురాను కఠస్తం పోటీలను నిర్వహించటం అభినందనీయమన్నారు . జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అద్యక్షులు రఫీక్ అహమ్మద్ మాట్లడుతూ పిల్లలు ఆన్లైను క్లాసుల తరుణంలో సొషల్ మిడియా కు దగ్గరై ఫోన్లు టాబ్లకు అలవాటు పడిపోయారని వారి దృష్టి మరల్చి వారిని సజీవ ఙివితం వైపునకు మరల్చడం కేవలం ఆధ్యాత్మికత ద్వారానే సాద్యం అవుతుందన్నారు . పవిత్ర ఖురాను పఠన అలవాటు వారికి సన్మార్గం , సాఫల్యత దిశగా తీసుకుని వెళ్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లల నుంచి ఫైనల్ కు వచ్చిన విద్యార్థులలో ప్రతిభకనపర్చిన వారికి నగదు బహుమతులను ప్రదానము జరిగింది. ఈ ఫైనల్ కు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించున్న చిన్నారులకు భాగస్వామ్య బహుమతుల కూడా అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *