Breaking News

రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్ లోని 104వ సచివాలయ పరిధిలోని కృష్ణలంక ఆర్చ్ రోడ్ నుండి మొదలై ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్ మరియు గుంటూరు వారి స్ట్రీట్ ప్రాంతాలలో నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏదైతే ఎన్నికల హామీలను ఇచ్చామో వాటిని పారదర్శకంగా అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అని, అందుకే మేము దమ్ముగా ప్రజల ముంగిటకు వచ్చి మేము అందించిన సంక్షేమ లబ్ధిని సగర్వంగా తెలియజేస్తున్నామని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అరాచక పాలన చేసారని అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. మరలా ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఆ పార్టీ నేత లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని అవినాష్ ప్రశ్నించారు. మీరు పాదయాత్ర కాదు కదా పోర్లు దండాలు పెట్టిన ప్రజలు మరో సారి మిమ్మల్ని నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని, వారి సంపూర్ణ మద్దతు జగన్ గారికే అని ధీమా వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో ఈ మూడేళ్ళ కాలంలోనే కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్ నిర్మాణం తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, మంచినీటి కుళాయిలు, డ్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్తలాలు, సంక్షేమ పథకాలు అందజేస్తున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైస్సార్సీపీ నాయకులు పుప్పాల రాజా,టి,పి రెడ్డి,మద్దెల పవన్,గోగు గౌరీ,మెడ రమేష్,మూలం రెడ్డి సుబ్బారెడ్డి,సుంకర పెద్దబ్బాయి,పంతలా సాయి మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *