విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంక ప్రజలు గత 30ఏళ్లుగా ఏదైనా శుభకార్యాలు, ఫంక్షన్లు చేసుకోవడానికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ ప్రాంతంలో కమ్యూనిటీ హల్ ఏర్పాటు చేస్తే అందరికి అనువుగా ఉంటుందని డివిజన్ పర్యటన లో మా దృష్టికి తీసుకురాగా తక్షణమే సంబంధిత అధికారులు, నగర మేయర్ దృష్టికి తీసుకెళ్లి 33లక్షల రూపాయల నిధులు మంజూరు చేపించినట్టు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం రణధీర్ నగర్ కట్ట మీద నూతనంగా నిర్మించబోయే కమ్యూనిటీ హాల్ కు మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలిసి అవినాష్ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కమ్యూనిటీ హల్ కోసం ప్రజలు ఎమ్మెల్యే చుట్టూ కళ్ళారిగెల తిరిగిన ఆయన పట్టించుకోలేదు అని, నేడు జగన్ ఆశీస్సులతో మా కల సాకారం అయ్యింది అని ప్రజలు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. నాడు 2009 లో స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు కమ్యూనిటీ హల్ కోసం 10లక్షల రూపాయల నిధులు మంజూరు చేపించారని కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిర్మాణం జరగలేదని అన్నారు. వీలైనంత త్వరగా ఈ కమ్యూనిటీ హల్ నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డివిజన్ అధ్యక్షులు టి.ఫి రెడ్డి మరియు వైస్సార్సీపీ,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News