Breaking News

పేదింటి పెళ్లికి సీఎం జగన్ ఆర్థిక తోడ్పాడు

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద కుటుంబాల్లో వివాహాలు జరిపించడం ఎంత కష్టమో పాదయాత్రలో స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను తీసుకొచ్చారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా నగదును జమ చేసిన నేపథ్యంలో సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఆంధ్రప్రభ కాలనీలో ఆయన చిత్రపటానికి సోమవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో పాటు మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఇప్పటికే పేదలకు కొండంత అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలతో మరో అడుగు ముందుకు వేశారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. లక్ష., కులాంతర వివాహానికి రూ. 1.20 లక్షలు., బీసీలకు రూ. 50 వేలు., కులాంతర వివాహానికి రూ. 75 వేలు., మైనార్టీలకు రూ. లక్ష., దివ్యాంగులకు రూ. 1.50 లక్షలు., గుర్తింపు ఉన్న భవన నిర్మాణ కార్మికులకు రూ. 40 వేల ఆర్థిక సాయాన్ని ఈ పథకాల కింద ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క పేదవాడి ఇంట్లో శుభకార్యం ఆగకూడదనే ప్రధాన ఉద్దేశంతో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన నూతన వధూవరులు తమ వివాహం జరిగిన 30 రోజుల్లోగా వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మల్లాది విష్ణు తెలిపారు. మైనార్టీలపై ప్రేమతో ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తే.. నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారన్నారు. మైనార్టీ వర్గాల రాజకీయ సాధికారత కోసం ఐదుగురు ఉపముఖ్యమంత్రులలో ఒకరిని మైనార్టీ వర్గాల నుంచి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఉర్దూను రాష్ట్ర రెండో అధికార భాష హోదా కల్పించడంతో పాటు.. మూడున్నరేళ్ళలో మైనార్టీ సంక్షేమం కోసం రూ. 20,330.43 కోట్లు ఖ‌ర్చు చేసినట్లు చెప్పారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అక్బర్, అఫ్రోజ్, నజీర్, రఫీ, అన్సారీ బేగ్, ఎస్.కె.బాబు, కరీముల్లా, ఎస్.కె.రఫీ, ఎస్.కె.ఇస్మాయిల్, ఎస్.డి.బాబు, షేక్ అలీ, నాగుల్ మీరా, ఫాతిమా, చాందిని, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *