Breaking News

నేటి స్పందనలో 79 అర్జీలు నమోదు…

-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో నమోదైన అర్జీలకు నిర్ధేశించిన గడువులోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలను ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. గడువు తీరిన అర్జీలు పెండిరగ్‌ ఉండరాదన్నారు. ఆఫ్‌ లైన్‌, ఆన్‌ లైన్‌లో నమోదవుతున్న అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, 1902 కాల్‌ సెంటర్‌, స్పందన మొబైల్‌ యాప్‌, వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా అర్జీలు నమోదవుతుంటాయన్నారు. స్పందనలో ఒకసారి నమోదైన అర్జీ తిరిగి నమోదు కాకూడదన్నారు. స్పందనలోని ప్రతి ఫిర్యాధును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్హత ఉన్నప్పటికి సంక్షేమ పథకాలు అందకపోవడం, అన్యాయం జరిగిన సందర్భాలలో ఫిర్యాధులు వస్తే విచారించి గడువులోగా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకొని అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. ఏపి సేవా డాష్‌, బోర్డు, జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్‌లలో జిల్లాకు చెందిన అర్జీల పెండిరగ్‌ లేకుండా ఆయా శాఖల అధికారులు పరిష్కరించాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
నేటి స్పందనలో 79 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలో 30, పోలీస్‌ 17, యంఎయుడి 5, సర్వే అండ్‌ సెటిలిమెంట్‌ 4, పౌర సరఫరాల శాఖ 4, పంచాయతీరాజ్‌ 3, ఏపిఎస్‌పిడిసిఎల్‌ 3,అటవీ 3, ఉపాధి కల్పన 3, విద్యా 1, దేవాదాయ శాఖ 1, ఆర్‌అబ్ల్యుఎస్‌ 1, సహాకార శాఖ 1, మత్స్య 1, కాలుష్య నియంత్రణ మండలి 1, సంఫీుక సంక్షేమం 1 శాఖలలో అర్జీలు నమోదయ్యాయన్నారు. జిల్లాలోని డివిజనల్‌ అధికారులు, ఆయా మండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వర్చువల్‌గా జిల్లా కలెక్టర్‌ పరిష్కారమయ్యే వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు.
స్పందన కార్యక్రమంలో డ్వామా పిడి జె. సునీత, డిఎస్‌వో పి కోమలి పద్మ, ఐసిడిఎస్‌ పీడి జి. ఉమాదేవి, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, డిసివో సిహెచ్‌ శైలజ, డిఆర్‌డిఏ పీిడి కె. శ్రీనివాసరావు, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్‌, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి బాలాజీ కుమార్‌, హౌసింగ్‌ పీడి శ్రీదేవి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి యం. విజయభారతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *