Breaking News

ఆర్థిక పరమైన లావాదేవీల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఆర్థిక పరమైన లావాదేవీల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు నిర్వహించే (ఫైనాన్స్‌ లిటరసీ) ఆర్థిక పరమైన అవగాహన కార్యక్రమాలలో భాగంగా ముంద్రించిన అవగాహన పోస్టర్లను సోమవారం నగరంలోని కలెక్టరేట్‌ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ 2016 సంవత్సరం నుండి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ ` మంచి లక్షణం అనే నేపథ్యం (థీమ్‌) లో భాగంగా ఆర్థిక పరమైన లావాదేవీల (ఫైనాన్స్‌ లిటరసీ) పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. జిల్లాలో నేటి నుండి 17వ తేది వరకు వారం రోజుల పాటు అన్ని బ్యాంకులలోను, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల తోడ్పాటుతో ప్రజలకు బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరవడం, బ్యాంకు ఖాతాల వల్ల ఖాతాదారులకు అందే సౌకర్యాలు, డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన, మోసపూరితమైన యాప్‌లు, అన్‌లైన్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన వుంటుందన్నారు. ప్రైవేట్‌ బ్యాంకుల వల్ల కలిగే నష్టాలు, ప్రభుత్వ గుర్తించిన బ్యాంకుల ద్వారా దస్తావేజులు అవసరం లేని విధంగా బుణాలను పొందేందుకు సులభతర డిజిటల్‌ విధానం పై అవగాహన కల్పిస్తారన్నారు.
అవగాహన పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్‌ ఎల్‌డియం పి కోటేశ్వరరావు, ఇండియన్‌ బ్యాంక్‌, కెనరాబ్యాంక్‌ కోఆర్డినేటర్లు, శాస్త్రీ, బాలాజీ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *