Breaking News

ఘనంగా “ఆహా” సంక్షేమ సంఘం ఏర్పాటు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దామోదర సంజీవయ్య 102 వ జయంతి సందర్భంగా ఆంధ్ర హరిదాసు అభివృద్ధి సంక్షేమ సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర హరిదాసు అభివృద్ధి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేండెం లక్ష్మణ్ తెలిపారు. గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన ఆహా సంక్షేమ సంఘం స్థాపిత కార్యక్రమంలో భాగంగా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహా వ్యవస్థాపక అధ్యక్షులు మెండెం లక్ష్మణ్ మాట్లాడుతూ రానురాను హరిదాసుల సంస్కృతి తెలుగు రాష్ట్రాలలో అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తర తరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ గ్రామాన హరి నామ కీర్తనలతో హరిదాసులు సందడి చేసే వారిని చెప్పారు. ప్రస్తుత తరానికి హరిదాసులు అంటే తెలియని పరిస్థితి ఏర్పడిందని విచారణ వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న హరిదాసు కళను తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటానికి, తెలుగు రాష్ట్రాల్లో అంతరించిపోతున్న హరిదాసు కలను తిరిగి బ్రతికించడానికి ఈ ఆహా సంక్షేమ సంఘం కృషి చేస్తోందని లక్ష్మణ్ తెలియజేశారు. ఆంధ్ర హరిదాసు అభివృద్ధి సంక్షేమ సంఘం ద్వారా రాష్ట్రంలో ఉన్న హరిదాసులను ఏకతాటిపై తీసుకువచ్చి వారి అభివృద్ధికి పాటుపడటానికి ఈ సంక్షేమ సంఘం ద్వారా కృషి చేస్తామని చెప్పారు. అలానే జిల్లాస్థాయి, మండల స్థాయి గ్రామస్థాయిలో కూడా ఆహా సంక్షేమ సంఘం యొక్క కమిటీలు త్వరలో ఏర్పాటు చేసి గని పటిస్ట పరుస్తామని లక్ష్మణ్ తెలియజేశారు. సంస్కృతిని, సంప్రదాయాలను, కళలను కాపాడుతున్న హరిదాసు లు అనేక ఆర్థికపరమైన ఇబ్బందులకు గురవుతున్నారని వారికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. అలానే మాలదాసు, మాలదాసరి, ప్రక్కన హరిదాసు అని కూడా చేర్చి గెజిట్లో పొందుపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఆహా ఉపాధ్యక్షులు కొరివి పుల్లారావు, కార్యదర్శి చెవుల నాగరాజు, ఉప కార్యదర్శి దాసరి ఎర్రన్న, కార్యనిర్వాహక కార్యదర్శి తిరువైపాటి వెంకటేశ్వర్లు, కోశాధికారి జోగి తిరుమలరావు, బెండెం బాలకృష్ణ, పీఠ వెంకట అప్పారావు, దాస్య మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ పటమటలంకలోని అదిత్య డిగ్రీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *