Breaking News

ధర్మవరం – విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలు మచిలీపట్నం వరకు పొడిగింపు

-విజయవాడ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి రైలును ప్రారంభించిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ లో కంటే 20 శాతం అధికంగా నిధులు కేటాయించడం జరిగిందని కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 350 కి. మీ. ల మేర కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 8600 కోట్లరూపాయలతో రైల్వేల అభివృద్దికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించారని గుర్తు చేశారు.
మచిలీపట్నం వరకు పొడిగించిన ధర్మవరం – విజయవాడల మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ఆయన ప్రారంభించారు. పలు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్రం బడ్జెట్ లో నిధులు కేటాయించారని చెబుతూ..విజయవాడ-షిరిడి ఎక్స్ ప్రెస్ రైలును మచిలీపట్నం వరకు, విజయవాడ-హూబ్లీ ఎక్స్ ప్రెస్ రైలును నర్సాపురం వరకు, నంద్యాల-కడప ఎక్స్ ప్రెస్ రైలును రేణిగుంట వరకు, విశాఖపట్నం-కాచిగూడ రైలును మహబూబ్ నగర్ వరకు, విశాఖ-విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలును గుంటూరు వరకు పొడిగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఆధినిక సాంకేతికత సహాయంతో వేగవంతమైన రైళ్లు ప్రవేశపెట్టేందుకు,కొత్తలైన్లు, ఎలక్ట్రిఫికేషన్, ట్రిప్లింగ్ పనులను చేపట్టడం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. రైల్వేల అభివృద్ధి తో పెట్టుబడులు, టౌన్ షిప్ లు వస్తాయని.. అన్ని ప్రాంతాల అభివృద్దికి కేంద్రం కృషి చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు త్వరలో వచ్చే అవకాశం ఉందన్నారు. టూరిజం అభివృద్ది కోసం విశాఖ-అరకు వరకు అద్దాల కోచ్ లతో కూడిన రైలును వేశామని చెప్పారు. విజయవాడ రైల్వే స్టేషన్ ను ఎయిర్ పోర్టు స్థాయిలో తీర్చిదిద్దుతామని.. ఇందుకు సంబంధించిన డీపీఆర్ సిద్దం అయ్యాక విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.
హైదరాబాద్ కు రైలు లో వచ్చే ఆంధ్ర ప్రజల సౌకర్యం కోసం నగర శివారు చర్లపల్లి వద్ద న్యూ రైల్వే టర్మినల్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చే డిసెంబర్ లోపు వంద వందేభారత్ రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందనికిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైల్వేల అభివృద్ధి కి చేస్తున్న కృషిని వివరించారు.ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *