Breaking News

దేశవ్యాప్తంగా స్పిరిచ్యూవల్ టూరిజం అభివృద్ధికి కేంద్రం కృషి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా స్పిరిచ్యూవల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బౌద్ధం, సిక్కిజం, జైనిజం, హైందవం ఈ నాలుగు మతాలకు భారతదేశం పుట్టినిల్లని అన్నారు. అమరావతిలో బుద్ధ సర్క్యూట్ ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ..స్వదేశి దర్శన్ కింద 7 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలో 50 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి‌నిర్మలా సీతారామ్ బడ్జట్ లో పేర్కొన్నారని.. ఇందులో భాగంగా నాగర్జున కొండను అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు.
కాకినాడ వైల్డ్ లైఫ్ శాన్ క్చూయరీ, బుడమేరు, మైపాడ్ బీచ్, బౌద్దమత సర్కూట్, అమరావతి ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. అమరావతి లింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 27.7 కోట్లు మంజూరు చేసామని చెప్పారు. ఏపీ టూరిజం శాఖ ద్వారా అభివృద్ధి పనులు కేంద్రం చేయిస్తుందని అన్నారు. కరోనా అనంతరం 2022 నుండి టూరిజం అభివృద్ధి పదంలో నడుస్తోందని ఎప్పుడూ లేనివిధంగా శ్రీనగర్ లో ఈ ఏడాది అధిక సంఖ్యలో టూరిస్టులు వచ్చారని పేర్కొనారు. టూరిజం ప్రగతికి ప్రధాని మోదీ బ్రాండ్ అంబాసిడర్‌ లా వ్యవహరిస్తున్నారని చెప్పారు.విద్యాసంస్థల్లో యువ టూరిజం క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
జీ20 భారత్ లో జరుగుతుంది, 29 దేశాల నుండి అన్ని శాఖల మంత్రులు, అధికారులు పాల్గొంటున్నారని; 250 సమావేశాలు 56 నగరాల్లో జరగబోతున్నాయన్నారు. సుమారు లక్షన్నర మంది అతిధులు రాబోతున్నారని అన్నారు. వారందరికీ మన సంస్కృతి, సాంప్రదాయాలు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
స్వదేశి దర్శన్ స్కీంలో కడప గండికోట, అరకు, లంబసింగి ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ట్రైబల్ మ్యూజియాన్ని అభివృద్ధి చేస్తున్నామని.. విశాఖ నుండి అరకు వరకు అభివృద్ధిని కేంద్రం చేస్తోందని తెలిపారు. అద్దాలతో కూడిన ట్రైన్ ఏర్పాటు చేశామని చెప్పారు.

అమరావతిని స్మార్ట్ సిటీగా కేంద్రం ప్రకటించిందని, ఇందుకు 500 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందని అన్నారు. సింహాచలం, అరుణాచలం దేవాలయాలను ఈ ఏడాది అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు వేదగిరి లక్ష్మీనరసింహస్వామీ ఆలయాన్ని ఈ ఏడాది అభివృద్ధి చేయడానికి సహాయం అందిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
స్వాతంత్ర్య వచ్చినప్పుడు నుండి 2014 వరకు దేశం నుండి అక్రమంగా తరలించిన సంపదను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని.. 13 అంటికుటీస్ ని తీసుకొచ్చామని, 269 అంటికుటీస్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు బీజేపీ నేతలు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *