Breaking News

ఘనంగా ఎబిసి-అమరావతి బోటింగ్‌ క్లబ్‌ 6వ వార్షికోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎబిసి-అమరావతి బోటింగ్‌ క్లబ్‌ తన 6వ వార్షికోత్సవాన్ని మంగళవారం భవానీఐలాండ్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎం.వేణుగోపాలరెడ్డి ఐఎఎస్‌, కలెక్టర్‌ మరియు జిల్లా మేజిస్ట్రేట్‌ మరియు ఇతర పర్యాటక అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎబిసి యొక్క సిఇఓ డాక్టర్‌ తరుణ్‌ కాకాని మాట్లాడుతూ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ టూరిజం మరియు మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం, భారత ప్రభుత్వం, యాచింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (వైఎఐ)తో సర్టిఫికేట్‌ పొందడం మరియు 2021-22లో ఉత్తమ వాటర్‌స్పోర్ట్స్‌ ఆపరేటర్‌ అవార్డును కూడా అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఎబిసి వాటర్‌స్పోర్ట్స్‌ ఒడిశా రాష్ట్రంలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఏబీసీలో తీసుకుంటున్న భద్రతా చర్యలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తరుణ్‌ కాకాని వంటి యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి రోయింగ్‌ క్రీడలో పతక విజేతలను తయారు చేసేందుకు అమరావతి బోటింగ్‌ క్లబ్‌, ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీతో కలిసి వాటర్‌స్పోర్ట్స్‌ శిక్షణా కేంద్రాన్ని కూడా నడుపుతోందని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *