Breaking News

నగరంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరి సందడి 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బి ఎన్ ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షో రూమ్ నగరంలోని లబ్బీపేట, బందరు రోడ్డు నందు హోటల్ గేట్ వే సమీపంలో నూతనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరీ, ఆంధ్ర రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆంధ్ర రాష్ట్ర వైద్య శాఖామంత్రి విడుదల రజిని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్,  సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగు నాగార్జున, విజయవాడ పశ్చిమ సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పలువురు నగర ప్రముఖులు, కార్పొరేటర్లు, నగర ప్రజలు పాల్గొన్నారు. యాజమాన్యం వారికి వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపకను బహుకరించి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎన్నార్ జ్యువెలరీలో అందరినీ ఆకర్షించే విధంగా ఆభరణాలు ఉన్నాయని తెలిపారు అనుపమ పరమేశ్వరి మాట్లాడుతూ బీఎన్నార్ బ్రాండ్ అంబాసిడర్ గా తనని ఎంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ షో రూమ్ లో రకరకాల జ్యువెలరీ తనను ఎంతగానో ముగ్ధులను చేసిందని చెప్పారు బిఎన్ఆర్ జ్యువెలరీ యజమాని అరవింద్ మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించటమే మా ధ్యేయమని చెప్పారు బంగారు ఆభరణాలలో మాపై నూరు శాతం విశ్వాసం కస్టమర్లు ఉంచవచ్చని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *