Breaking News

అగర్వాల్ ఐ హాస్పిటల్ ను ప్రారంభించిన ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని రాఘవయ్య పార్క్ ఎదురుగా అగర్వాల్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి విడదల రజని ప్రారంభించారు. బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విజయవాడ నగరంలో అగర్వాల్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్టల్ ప్రారంభించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో విప్లవకమైన మార్పులు తేవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేషమైన కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఎంతో పేరుగాంచిన ప్రతిష్టాత్మక అగర్వాల్ ఐ హాస్పిటల్ నగరంలో ప్రారంభించడం శుభప్రదం అన్నారు. అగర్వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అగర్వాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శనీయకమైన నాయకత్వంలో రాష్ట్రం ఆరోగ్య రంగంలో వేగవంతమైన పురోగతిని సాధిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేత్ర సంరక్షణను సులభతరంగా, మెరుగ్గా సేవలందించడానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఆరు జిల్లాల్లో మా సేవలను విస్తరించామని రోజుకి 2000 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాబోయే రోజులలో ప్రపంచస్థాయి నేత్ర సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. రాబోయే మూడేళ్లలో 30 హాస్పిటల్స్ నిర్మించటానికి 500 కోట్లు పెట్టుబడుల తో ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలియజేశారు. 1957 సంవత్సరంలో ప్రారంభమైన అగర్వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ నేడు ప్రపంచంలోని 10 దేశాల్లో 135 పైబడి హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఉత్తమ సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగర్వాల్ ఐ హాస్పిటల్ రీజినల్ హెడ్ కండ్రు కళ్యాణ శ్రీనివాస్ చక్రవర్తి, డాక్టర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని కి అగర్వాల్ ఐ హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *