Breaking News

ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ లబ్ది అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్ 106 పరిధిలోని పచ్చ మెడ బజార్,నల్లూరి వారి స్ట్రీట్ ప్రాంతాలలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాల హయాంలో వెనుకబడిన ఈ కృష్ణలంక ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు రోడ్లు, సైడ్ డ్రైన్స్, ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో ఇక్కడ కార్పొరేటర్ లు ఓడిపోయారని ఈ ప్రాంత అభివృద్ధి గురుంచి పట్టించుకోకుండా ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్న వినకుండా ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. నిన్న స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం లో విజయవాడలో శాంతి భద్రతలు లేవు అని అంటున్నారు అని, ఒక్కసారి గతంలో వారి ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యలు, కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఘటనలు గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఆ ఘటనలు అన్నింటిలో టీడీపీ నాయకులు సూత్రధారులు గా ఉన్నారని జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నింటినీ అణిచి వేశారని అందుకే ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని అన్నారు. మీరెన్ని అసత్య ప్రచారాలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వారి సంపూర్ణ మద్దతు సంక్షేమ పాలన అందిస్తున్న వైసీపీ కె అని ఆవినాష్ ధీమా వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైస్సార్సీపీ నాయకులు పుప్పాల రాజా, టి,పి రెడ్డి, మద్దెల పవన్, మెడ రమేష్, మూలం రెడ్డి సుబ్బారెడ్డి, సుంకర పెద్దబ్బాయి, పంతలా సాయి మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *