-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 258 వ వార్డు సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శమని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బుధవారం 58 వ డివిజన్ 258 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి మూడో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. సుందరయ్య రోడ్డు, కె.ఎల్.రావు రోడ్డులో విస్తృతంగా పర్యటించి.. 265 గడపలను సందర్శించారు. ప్రజలకు అందించిన సంక్షేమంపై ఆరా తీస్తున్నప్పుడు వారి స్పందన, ప్రభుత్వంపై వారికి ఉన్న ప్రేమను స్పష్టం చేస్తోందన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు వాలంటీర్లు దిక్సూచిగా వ్యవహరిస్తూ.. అండగా నిలుస్తున్నారని లబ్ధిదారులు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. నవరత్నాలతో తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గ్రీవెన్స్ స్వీకరించారు. కూలిన సైడ్ డ్రెయిన్ల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా అధికారులకు సూచించారు. అలాగే అవసరమైన చోట వీధి దీపాలను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
టీడీపీ హయాంలో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు
చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రజలు పడరాని పాట్లు పడ్డారని మల్లాది విష్ణు విమర్శించారు. అవ్వాతాతలను ఇబ్బందులకు గురిచేయకుండా ఏఒక్క నెల పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. జన్మభూమి కమిటీల పెత్తనంతో ఎందరో అర్హులకు కూడా సంక్షేమ పథకాలలో కొర్రీలు పెట్టేవారని గుర్తుచేశారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గుమ్మం వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చి చేరుతున్నాయని చెప్పారు. దేశంలోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి.. చెప్పిన తేదీకే లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా నగదును జమ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. గ్రామ/ వార్డు సచివాలయాలు, దానికి అనుసంధానంగా వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి పరిపాలనను ప్రజల ముంగిట నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అలాగే సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా కన్వీనర్లు, గృహ సారథులను నియమించడం జరిగిందన్నారు. వీరంతా సమన్వయంతో పనిచేసి ప్రజాసేవలో జగనన్న తోడుగా నిలవాలని కోరారు. మార్చి 16 నుంచి 26 వరకు పది రోజుల పాటు చేపట్టనున్న ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమాన్ని అన్ని వార్డు సచివాలయాల పరిధిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన 420 ఎవరో లోకేష్ చెప్పాలి
టీడీపీ నేత నారా లోకేష్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. గొప్ప గొప్ప నాయకులను విమర్శిస్తే.. తాము గొప్ప నేతలవుతామని నారా లోకేష్ భావిస్తే అది అవివేకమే అవుతుందని మల్లాది విష్ణు అన్నారు. ప్రజలను మోసగించడంలో చంద్రబాబు, నారాలోకేష్ లను మించిన 420 లు దేశంలోనే లేరని విమర్శించారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మేనిఫెస్టోను మాయం చేసిన 420 లు మీరు కాదా..? అని సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, పార్టీ గుర్తును లాక్కున్న 420 ఎవరో..? నారా లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్ సీపీని ఒంటరిగా ఢీ కొనే సత్తా లేని టీడీపీ నేతలు మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు వరుసగా 7 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైనా.. తమకు ప్రజాబలం ఉందని టీడీపీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. మరోవైపు తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరులో ఎటువంటి మార్పు లేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పునరుద్ఘాటించారు. విద్యుత్ కాంతులతో కూడిన డిజిటల్ బోర్డులను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఈ అరుణ్ కుమార్, సీడీఓ జగదీశ్వరి, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, తోపుల వరలక్ష్మి, క్రాంతి, శ్రీనివాసరెడ్డి, శోభనాలు, శ్యామ్, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News