Breaking News

గడపగడపలో సమస్యల పరిష్కారం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే అందుతున్నాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 18వ డివిజన్, 84 సచివాలయం పరిధిలో రాణిగారితోట కోరినేమయ్యా స్ట్రీట్ నుండి మొదలై మాదాల వెంకటేశ్వరరావు స్ట్రీట్ ప్రాంతాలలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసి, చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన కేవలం మూడేళ్ళ కాలంలోనే 98 శాతం పైగా హామీలు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఏదైనా సాంకేతిక కారణాల వలన ఎవరికైనా ఏదైనా పధకాలు అందకపోతే వారికి కూడా న్యాయం చేయడానికి ఈ గడపగడపకు కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఎన్నడైన ఇలా ప్రజలు సమస్యలు తెలుసుకున్నార, అసలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చరో చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రజలలో రోజురోజుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పడుతున్నాయని అందుకే అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్,వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *