Breaking News

అభివృద్దే వైసీపీ ప్రభుత్వ నినాదం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్ధి నినాదంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సాంక్షన్ ఐయ్యిన శివశంకర నగర్ సిసి రోడ్,జెడి నగర్ 1st,2nd క్రాస్ సిసి రోడ్లు,రామ్ దూద్ సిసి రోడ్ దాదాపు 64లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు జరిగిన శంకుస్థాపన పనులకు అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అందుకే హామీ ఇచ్చిన ప్రతి అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పనులు పూర్తి అయ్యేలా నిరంతర పర్యవేక్షణ చేస్తూ నాణ్యత లోపం లేకుండా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో అర్భటంగా శంకుస్థాపన లు చేసి ప్రచారం చేసుకోవడం తప్ప పనుల పురోగతి గురుంచి పట్టించుకొనే వారు కాదని విమర్శించారు. వారు శంకుస్థాపన చేసిన ఎన్నో పనులు వైసీపీ ప్రభుత్వం లో పూర్తి చేశామని తెలిపారు. ఈ ప్రభుత్వం సంక్షేమం తప్ప అభివృద్ధి గురుంచి పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ఒక్కసారి తూర్పు నియోజకవర్గనికి వచ్చి చూడండి ఈ మూడేళ్ళ లో నియోజకవర్గంలో మేము చేపట్టిన 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులే సమాధానం చేబుతాయాని అవినాష్ చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ టీడీపీ ప్రభుత్వం లో చేపట్టిన అభివృద్ధి అంతా ఆయన కంప్యూటర్ స్క్రీన్ మీద, లేదా ఆయన అనుకూల మీడియా పేపర్లో తప్ప వాస్తవ రూపంలోకి రాలేదని ఎద్దేవా చేశారు. ఆయన ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు వైస్సార్సీపీ కార్పొరేటర్లు గెలిచిన డివిజన్ లలో అసలు అభివృద్ధి చేసేవారు కాదని, వారు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్న ఎన్ని నిరసన ప్రదర్శనలు చేసిన అసలు పట్టించుకొనేవారు కాదని విమర్శించారు. కానీ నేడు జగన్ గారు గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు అని కొనియాడారు. ప్రజల సంపూర్ణ మద్దతు తో తిరిగి మరలా జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు. ఈ 13వ డివిజన్ రామాయణపు శ్రీనివాస్,ఎన్టీఆర్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు చిమాటా బుజ్జి,వైస్సార్సీపీ నాయకులు కోలా ఉమా, హనాన్, మీరవాలి, ధనుష్,స్వామి,సాంబశివరావు,మధు,బాబూరావు,సుబ్బారావు మరియు జెడి నగర్ వెల్ఫేర్ అసోషియేషన్, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *