Breaking News

పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం మనది

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-64 వ డివిజన్ 284 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల ఆర్థికాభివృద్ధే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యమని.. ఆ దిశగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గురువారం 64 వ డివిజన్ 284 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజాశక్తి నగర్లో విస్తృతంగా పర్యటించి.. 176 గడపలను సందర్శించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు వివరించి సంక్షేమ క్యాలెండర్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ప్రాంత ప్రజలు ఆప్యాయంగా పలకరించారు, కర్పూర హారతులు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు వెల్లడించారు. గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలను, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మేలును వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలియజేశారు. గుమ్మంగుమ్మంలో సంక్షేమం వెల్లివిరుస్తుండటంతో ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా తమను సాదరంగా ఆహ్వానిస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి.. ప్రతి పేద కుటుంబ ఆర్థిక పరిపుష్టికి గడప గడపకు మన ప్రభుత్వం ఎంతగానో దోహదపడుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై చర్చించి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సచివాలయ పరిధిలో రూ. 7.15 కోట్ల సంక్షేమం
నవరత్నాల పథకాల ద్వారా 284 వ వార్డు సచివాలయ పరిధిలో 7 కోట్ల 15 లక్షల 50 వేల 22 రూపాయల సంక్షేమాన్ని మూడున్నరేళ్లలో అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 293 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 276 మందికి రూ. 38.64 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి దీవెన ద్వారా 75 మందికి రూ. 20.60 లక్షలు., చేయూత ద్వారా 114 మందికి రూ. 21.37 లక్షలు., కాపు నేస్తం ద్వారా 21 మందికి రూ. 3.15 లక్షలు., వాహనమిత్ర ద్వారా 27 మందికి రూ. 2.70 లక్షలు., జగనన్న తోడు ద్వారా 35 మందికి రూ. 3.50 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు.

అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తి లేదు
అభివృద్ధి విషయంలోనూ ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదని మల్లాది విష్ణు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా గుర్తించిన సమస్యల పరిష్కారానికి ప్రతి సచివాలయానికి రూ. 20 లక్షలు నిధులు కేటాయించారని చెప్పారు. సచివాలయ పరిధిలో ఈ నిధులతో ప్రజాశక్తినగర్ ప్రధాన రహదారిని నిర్మించనున్నట్లు వివరించారు. కండ్రిక నుంచి పాతపాడు వరకు రహదారి నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. అలాగే 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేయాలని నిర్ణయించడంతో నున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని కండ్రిక, ఎన్.ఎస్.సి.బోస్ నగర్, పాయకాపురం పరిసర ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న వేలాది అర్జీలకు పరిష్కారం లభించనుందని వివరించారు. ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వానికి మెండుగా ఉన్నాయని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమం, అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈనెల 3, 4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 విజయవంతమై రాష్ట్రానికి భారీగా ఎంఓయూలు జరగాలని.. యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరారవు, సీడీఓ జగదీశ్వరి, వైసీపీ డివిజన్ కోఆర్డినేటర్ ఎస్.కె.ఇస్మాయిల్, అధ్యక్షులు జిల్లెల్ల శివ, నాయకులు యరగొర్ల శ్రీరాములు, అక్తిశెట్టి నారాయణ, పందిరి వాసు, మేడా రమేష్, చెక్కా నరసింహరావు, గురాల యేసు బాబు, మీసాల రామకృష్ణ, అగురు త్రినాథ్, అనిల్, వెంకటేశ్వమ్మ, నాగమణి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *