Breaking News

రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారే:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వారికి తగిన ప్రోత్సాహకాలు అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి పారిశ్రామిక అభివృద్ధి కి కృషి చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. మంగళవారం 17వ డివిజన్ వైస్సార్సీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఇండస్ట్రియల్ సమ్మిట్ విజయోత్సవ వేడుకల్లో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైజాగ్ లో జరిగిన సమ్మిట్ లో రాష్ట్రానికి దాదాపు 6లక్షల ఉద్యోగాలు కల్పించేలా 13లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 352 ఒప్పందాలు జరిగాయి అంటే దానికి ముఖ్య కారణం జగనన్న అని అన్నారు. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీల పారిశ్రామిక వేత్తలు వైజాగ్ వచ్చి పెట్టుబడులు పెట్టడానికి తమ ఆసక్తి చూపిస్తుంటే ఓర్వలేక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా ద్వారా దానిమీద విషం చిమ్మే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. నాడు టీడీపీ హయాంలో జరిగిన సమ్మిట్ లో డ్రైవర్లు, వాళ్ళ దగ్గర పనిచేసే ఉధోగస్థులకు సూట్ బూట్ వేసి చంద్రబాబు తో ఫోటో తీసి వారి అనుకూల మీడియా ద్వారా ఆర్భాటంగా ప్రచారం చేసుకొన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అప్పుడు జరిగిన ఒప్పందలలో ఎన్ని కార్యరూపం దాలచాయో వాస్తవాలు చెప్పగలరా అని లోకేష్ ను సూటిగా ప్రశ్నించారు. వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకే నేడు ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పార్టీ యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,17వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ తంగిరాల రామిరెడ్డి మరియు నియోజకవర్గ కార్పొరేటర్లు,ఇంఛార్జీలు,వైస్సార్సీపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *