Breaking News

అభివృద్ధి, సంక్షేమం సమ ప్రాధాన్యత గా జగనన్న పాలన:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా సమ ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 18వ డివిజన్, 83వ సచివాలయం పరిధిలోని రాణిగారితోట ప్రాంతంలో అవినాష్ ఇంటింటికి పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతావాసుల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు, కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు, సైడ్ డ్రైన్స్, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైసీపీ దే అని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో రిటైనింగ్ వాల్ నిర్మించాలంటే ఇక్కడ ఇళ్ళు అన్ని తొలగించాలని ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి, టీడీకో ఇళ్ల పేరుతో టీడీపీ నాయకులు ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేసారని విమర్శించారు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వం లో కేవలం అవసరమైన మేర మాత్రమే ఇళ్ళు తొలగించి, వారందరికి అన్ని మౌలిక సదుపాయాలతో నూతన ఇళ్ళు ఉచితంగా అందజేసామని తెలిపారు. ప్రభుత్వ పాలన పట్ల ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని మరోమారు జగనన్నను ముఖ్యమంత్రి గా ఎన్నుకోడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ 18వ డివిజన్ కార్పొరేటర్,వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *