– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-64 వ డివిజన్ 285 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి విజనరీ లీడర్ దేశంలోనే మరొకరు లేరని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం 64 వ డివిజన్ 285 వ వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన హాజరయ్యారు. కండ్రిక, ఎన్.ఎస్.సి.బోస్ నగర్, ఎన్జీవో కాలనీలలో విస్తృతంగా పర్యటించి.. 331 గడపలను సందర్శించారు. ఎక్కడకు వెళ్లినా, ఏ కుటుంబం తలుపుతట్టినా.. సంక్షేమ పథకాలు అందుతున్నాయనే ప్రజలు చెబుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డినే మరోసారి తమ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాలకు మూడున్నరేళ్లలో జరిగిన మేలును బుక్ లెట్ల ద్వారా తెలియజేశారు. విద్యా, వైద్య, గృహ నిర్మాణ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యత.. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్ల పథకాలను ప్రవేశపెట్టడం వెనుక గల ఆవశ్యకతను లబ్ధిదారులకు వివరించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ట్యాబ్ లు చదువుకు ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయనేది 8వ తరగతి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇంగ్లీష్ ల్యాబ్ లను సద్వినియోగపరచుకుని ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించాలని సూచించారు.
సంక్షేమంలో అగ్రగామి
పేద ప్రజలకు సంక్షేమం అందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని మల్లాది విష్ణు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారు లంకలపల్లి కమల మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం తనకు పునర్జన్మను ప్రసాదించిందని చెప్పారు. హృద్రోగంతో బాధపడుతున్న ఆమెకు జగనన్న ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుందన్నారు. తోట రాజేశ్వరి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాపునేస్తం, రైతుభరోసా, ఆసరా, సున్నావడ్డీ, పింఛన్ కానుక పథకాలు వర్తిస్తున్నట్లు చెప్పారు. మరో లబ్ధిదారు తోట లక్ష్మీ కాంతమ్మ మాట్లాడుతూ.. తన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ. 9.19 లక్షల లబ్ధి చేకూరిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఏదో ఒక పథకం రూపంలో చేకూరుతున్న మేలును చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలన్నీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మల్లాది విష్ణు విమర్శించారు.
మహిళల తలరాతను మార్చేలా పథకాలు
రాష్ట్ర ప్రగతికి మహిళలే మూల స్తంభాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్.ఎస్.సి.బోస్ నగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ అక్కచెల్లెమ్మలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలను గౌరవించటం మన సంప్రదాయమని.. కుటుంబంలో ప్రేమ బాంధవ్యాలు పెంపొందించటంలో, మెరుగైన సమాజం సృష్టించటంలో మహిళల సేవ ఎనలేనిదని కొనియాడారు. స్త్రీలు మగవారి కంటే అన్ని విషయాలలో ఒక అడుగు ముందే ఉంటారని.. వారంతా పూర్తి సామర్ధ్యాలు వినియోగించుకుంటే దేశం ఎంతో పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. సీఎం జగనన్న పాలనలో అక్కచెల్లెమ్మలకు ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వెల్లువలా అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో మహిళలు దేశంలో ఎక్కడాలేని విధంగా తమ కాళ్ల మీద తామే ధైర్యంగా నిలబడగలుగుతున్నారని పేర్కొన్నారు. సెంట్రల్లో గత మూడున్నరేళ్లలో మహిళా సంక్షేమానికి రూ. 280.39 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గత తెలుగుదేశం పాలకులు నమ్మించి మోసం చేస్తే.. నేటి పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో మహిళా సాధికారత సాకారమవుతోందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిన దార్శనికత వల్లే చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యత పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక చర్యలతో మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తున్నారని పునరుద్ఘాటించారు. అనంతరం డీపీ స్టేషన్ పార్కు వద్ద స్థానికులతో కలిసి మొక్కలను నాటారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరారవు, నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఎస్.కె.ఇస్మాయిల్, జిల్లెల్ల శివ, మేడా రమేష్, పందిరి వాసు, కొక్కిలిగడ్డ నాని, తాండవ కోటి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News