Breaking News

పేదల ఆశలను నిజం చేస్తున్నాం

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా 36 మందికి హక్కుతో కూడిన ఇళ్ల దస్తావేజుల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సొంత ఇళ్లు లేనివారు ఎవరూ ఉండకూడదన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీ హెచ్ బ్లాక్ సచివాలయం నందు మంగళవారం 36 మంది ఓటీఎస్ లబ్ధిదారులకు మూడో విడత హక్కుతో కూడిన ఇళ్ల దస్తావేజుల పత్రాల పంపిణీ ఎమ్మెల్యే చేతులమీదుగా జరిగింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చెప్పిన ఒక్క మాటతో ఆనాడు వాంబే కాలనీలో 1,056 మంది పేదలు గృహ యజమానులుగా మారారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తుచేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం 105 మంది పేదల నుంచి రూ. 60 వేలు చెల్లించుకుని పట్టాలను పంపిణీ చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. నాలుగు సార్లు ఫైల్ పంపించినా.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన పడేశారన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏళ్ల తరబడి పరిష్కారంకాని హెచ్ బ్లాక్ కాలనీవాసుల సమస్యకు పరిష్కారం లభించిందని మల్లాది విష్ణు తెలిపారు. అలాగే చేతులు మారిన ఇళ్లకు సైతం హక్కుతో కూడిన ఇళ్లపత్రాలు అందజేయడం జరిగిందన్నారు. మొత్తం 529 పట్టాలలో గతంలో 489 పంపిణీ చేయగా.. మిగిలిన 36 మందికి నేడు దస్తావేజులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఓటిఎస్ విధానంలో డాక్యుమెంట్ కి సొంత ఆస్తి విలువ ఉంటుందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆస్తికి అసెస్మెంట్ నెంబర్ వస్తుందని.. దానితో అన్ని హక్కులు వర్తిస్తాయని చెప్పారు. నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి అభిమతమని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, నార్త్ తహసీల్దార్ దుర్గాప్రసాద్, హౌసింగ్ డీఈ రవికాంత్, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, 18వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ, నాయకులు నాళం బాబు, ఆర్.ఎస్.నాయుడు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *