Breaking News

కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది..

-కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా.
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు తమ కాళారుపాలతో జీవం పోసి బావితరాలకు అందిస్తున్న పేద కళాకారులను ప్రభుత్వం అన్ని విధాల అదుకుంటుందని, కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన కళాకారులకు మంజూరైన గుర్తింపు కార్డులను మంగళవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆయన కార్యాలయంలో అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ పేదరికంలో ఉన్నప్పటికి కళపై ఉన్న మమకారంతో వ్యయ ప్రయాసలను లెక్క చేయకుండా నేటికి పలు ప్రదర్శనల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలకు జీవం పోస్తున్న కళాకారులను అదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 58 సంవత్సరాలు నిండిన నిరుపేదలైన కళాకారులకు నెలకు 3 వేల రూపాలయ చొప్పున ప్రభుత్వం పెన్షన్‌ మంజూరు చేయడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడిన ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఇప్పటికే అర్హలైన 195 మంది వృద్ద కళాకారులకు పెన్షన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. మరో 3,463 మంది డప్పు కళాకారులకు ప్రతి నెల 3 వేల చొప్పున 1 కోటి 38 లక్షల 90 వేలు జిల్లా గ్రామీణాభివృద్ధి ద్వారా అందజేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎంతో మంది ప్రఖ్యాత కళాకారులకు పురిటిగడ్డ అయిన వారిని స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది కళాకారులు ఇప్పటికి కళా ప్రదర్శనలను ప్రదర్శిస్తు జీవనాన్ని కొనసాగిస్తున్నారన్నారు. వీరిలో ఎక్కువ మంది డప్పు కళపై ఆధారపడుతున్నారన్నారు. డప్పు కళాకారులకు నృత్యాల గేయాలపై శిక్షణ అందించి వారి ప్రతిభను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలలో జిల్లాకు చెందిన డప్పు కళాకారుల సేవలను వినియోగించుకునేలా అధికారులను ఆదేశిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సంస్కృతుల వికాశానికి కళాకారులు అందిస్తున్న సేవలు మరవలేనివి అన్నారు. పౌరాణిక సాంఫీుక, నాటక రంగాలలో అభివృద్ధి చేసిన కళాకారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో అర్హత కలిగిన కళాకారులకు గుర్తుంపు కార్డులను మంజూరు చేస్తామన్నారు. గుర్తింపు కార్డుల ద్వారా కళాకారులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. అనంతరం డప్పు కళాకారులు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావుని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలను తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యు. సురేంద్రనాద్‌, డిపిఆర్‌వో ఎస్‌వి మోహన్‌రావు, ఆడియో విజువల్‌ సూపర్‌వైజర్‌ ఎ. సాయిబాబా, పబ్లిసిటీ అసిస్టెంట్‌ వి వి ప్రసాద్‌, పలు కళాకారుల సంఘాల ప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *