Breaking News

అభివృద్ధిలో మహిళ అధికారుల భాగస్వామ్యం అనిర్వచనీయం…

మహిళా అధికారుల సహకారంతో అభివృద్ధిలో జిల్లా అగ్రగామి…
కుటుంబ, ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయులు…
జిల్లా కల్టెర్‌ ఎస్‌ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా అభివృద్ధిలో మహిళ అధికారుల భాగస్వామ్యం అనిర్వచనీయమని, రెవెన్యూ, విద్యా, వైద్య, గ్రామీణ ఉపాధి, వ్యసాయ వంటి కీలక రంగాలతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతమైన నిర్వహిస్తున్న మహిళా అధికారులు అభినందనీయులను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో పలు ప్రభుత్వ శాఖలలో సేవలందిస్తున్న జిల్లా స్థాయి అధికారులను మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మట్లాడుతూ స్త్రీ లేనిదే జననం గమనం లేదని, స్త్రీ లేనిదే అసలు సృష్టేలేదని ఆయన అన్నారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే మాతృమూర్తే ప్రత్యక్ష ధైవం అన్నారు. కుటుంబ బాధ్యతలో పాటు ఉద్యోగ ధర్మాన్ని భాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ఒక వైపు కుటుంబం మరో వైపు ఉద్యోగ ధర్మంలో కీలక భూమిని పోషిస్తు మహిళా అధికారులు అందిస్తున్న కృషి మరువలేదన్నారు. జిల్లాలో పునర:వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడిన ఎన్‌టిఆర్‌ జిల్లాలో సగానికి పైగా మహిళా అధికారులే ఉన్నారన్నారు. వారి సహకారంతో జిల్లాలో రెవెన్యూ విద్య వైద్య గ్రామీణ ఉపాధి పౌరసరఫరాలు మహిళ శిశు సంక్షేమం వ్యవసాయం, గృహ నిర్మాణం వంటి కీలక రంగాల సర్వతో ముఖాభివృద్ధికి చెందుతుందన్నారు. జిల్లా పరిపాలనలో జాయింట్‌ కలెక్టర్‌ హోదాలో ఎస్‌ నూపూర్‌ అజయ్‌ సబ్‌ కలెక్టర్‌ హోదాలో అదితి సింగ్‌ అందిస్తున్న సహకారం మరువలేదన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టిన విజయవంతం చేయడంలో మహిళా అధికారులు క్రీయాసీలక పాత్రను పోషిస్తారన్నారు. మహిళలకు సహజంగా కుటుంబ బాధ్యతలు అధికంగా ఉంటాయని వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భర్త పిల్లల బాధ్యతల వలన ఇంటిలో పని ఒత్తిడి ఉద్యోగ ధర్మం రెండిరటిని సమపాలనలో నిర్వరిస్తూ ఉన్నత అధికారుల మన్ననులనుపొందడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని, అందుకు సంబధించిన లబ్దిదారుల ఎంపిక వారికి నేరుగా నగదు పంపిణీతో పాటు రోజువారి కార్యకలాపాలకు ఆటంకం కలుగకుండా మహిళా అధికారులు రేయింబవళ్లు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారన్నారు. ఇంటి ఇల్లాలు విద్యా వంతురాలైతే అభివృద్ధిలో ఆ కుటుంబానికి తిరుగు ఉండదు అని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. అలాగే కుటుంబాన్ని విజయపథంలో నడిపిస్తున్న మహిళా అధికారుల కఠోర కృషి ఫలితంగానే ఎన్‌టిఆర్‌ జిల్లా అభివృద్ధి చెందుతోందన్నారు. విద్య, వైద్య, గృహ నిర్మాణం, గ్రామీణ ఉపాధి రంగాలలో ఎన్‌టిఆర్‌ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవంతో జిల్లా స్థాయి మహిళా అధికారుల కృషి మరువలేనిదన్నారు. ప్రధానంగా పేదలకు ఉపాధి కల్పనలో ఉపాధి పథకం అమలు వేతనాల చెల్లింపులో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. జిల్లాకు తాను కుటంబ పెద్దగా ఉంటే మహిళా అధికారులు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కలెక్టర్‌ డిల్లీరావు కొనియాడారు.తొలుత సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, అడిషనల్‌ డిసిపి పి. వెంకటరత్నం, జిల్లా వ్యవసాయ అధికారి యం విజయభారతి, డ్వామా పిడి జె. సునీత, ఐసిడిఎస్‌ పిడి. జి. ఉమాదేవి, డిసిఎస్‌వో పి. కోమలిపద్మ, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, మార్క్‌ఫెడ్‌ యండి నాగమల్లిక, సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ యం వి. విజయభారతి, హౌసింగ్‌ పిడి శ్రీదేవి, జిల్లా సైనిక సంక్షేమాధికారిణి డా.కె.కళ్యాణ వీనా, గ్రామ వార్డు సచివాయల ప్రత్యేక అధికారి కె. అనురాధ, సిపివో రత్నరూత్‌, వియంసి జోనల్‌ కమీషనర్‌ జి.సృజన, అడిషనల్‌ కమీషనర్‌ శ్యామల, డిప్యూటి కమీషనర్‌ వెంకటలక్ష్మి, యుడిసి ప్రాజెక్టు ఆఫీసర్‌ శకుంతల, తదితరులు కలెక్టర్‌ డిల్లీరావు నుండి సన్మానం అందుకున్నారు.అనంతరం సన్మానం అందుకున్న మహిళా అధికారులు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావును దుశ్శాలువ, జ్ఞాపికతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *