విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్‌సిజి క్యూరీ సిటీ క్యాన్సర్‌సెంటర్ ఆధ్వర్యంలో బిఆర్టిఎస్ రోడ్డు లో రెండు కిలో మీటర్ల మేర సాగిన వాకథాన్ పరుగును మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలే కీలకపాత్ర అని అన్నారు. మహిళలు ఆత్మబలంతో ముందుకు వెళ్ళడానికి కావలసన శక్తి చదువు వలన మాత్రమే లభిస్తుందన్నారు. ఉద్యోగ బాధ్యతలు కుటుంబ వ్యవహరాలలో ఎదురయ్యే పరిస్థితులను ఎంతగానో సమర్థవంతంగా తీర్చిదిద్దుతారన్నారు. మహిళల శాతం పురుషులతో సమానంగా ఉన్నప్పుడే సమ సమాజస్థాపన సాధ్యపడుతుందన్నారు. మహిళలు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యత వ్యక్తగత ఆరోగ్యానికి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. రోజులో కొంత సమయాన్ని వారి కోసం కేటాయించుకోవాలన్నారు. మహిళల ప్రవర్తన ఒకరికి సహాయ పడే విధంగా ఉంటుందన్నారు. ప్రతి ఇంటిలో మహిళను పురుషులతో సమానంగా చూడాలని అన్నారు. ఆడ మగ పిల్లల్ని తేడాలు లేకుండా పెంచాలన్నారు. సమాన అవకాశాలను విద్య నైపుణ్యాన్ని ఆడ పిల్లలకు ఇచ్చినప్పుడే జిల్లా ముందుకు సాగుతుందన్నారు. లింగ నిర్థారణ పరీక్షలు చేయవద్దని ఆడ మగ వివక్ష వద్దని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
Prajavartha Online Telugu News