విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పేదలకు సామాజిక ఆర్థిక అభివృద్ధి కల్పించి వారి అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 18వ డివిజన్ లో, 82వ సచివాలయం పరిధిలో ని రాణిగారితోట కంచర్ల కోటయ్య స్ట్రీట్, తమ్మిన పోతురాజు స్ట్రీట్ ప్రాంతంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా తమ ఇంటి వద్దకే వస్తున్నాయని ప్రజలు తమ సంతోషన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ఈ సచివాలయం పరిధిలో ఎక్కువ మంది ఉపాధి నిమిత్తం ప్రక్క రాష్ట్రాల నుండి వలస వచ్చిన ప్రజలే ఉన్నారని, వారికి కూడా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగనన్నదే అని కొనియాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో వారిని అసలు పట్టించుకోలేదు అని, ఈ ప్రాంతాన్ని అసలు అభివృద్ధి చేయలేదని, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం పెద్దలు ఎన్నిసార్లు ఎమ్మెల్యే గద్దె చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదని విమర్శించారు. కానీ నేడు ఆ సమస్య మా దృష్టికి వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేపించి పనులు మొదలుపెట్టడం జరిగిందని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ 18వ డివిజన్ కార్పొరేటర్,వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డివిజన్ అధ్యక్షులు భిక్షాల్ రెడ్డి మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News