Breaking News

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో కార్పొరేటర్  బాలి గోవింద్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ ఆదేశాల మేరకు గురువారం  6వ రోజు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 36వ డివిజన్ కార్పొరేటర్  బాలి గోవింద్  సీతన్నపేట లో వాకముడి వారి వీధి, మాజేటి వీర రాఘవమ్మ వారి వీధిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సమస్యలు ఏమున్నాయని అడిగి తెలుసుకుని, కాలువలు & డ్రైనేజీ  చెత్త సమస్యలు ఎక్కువ ఉండటంతో  విఎంసి శ్రీధర్  సిబ్బందితో మాట్లాడి తన దృష్టికి వచ్చిన సమస్యను సాయంత్రంలోగా పరిష్కరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా బాలి గోవింద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహకారంతో డివిజన్లోని అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ ప్రెసిడెంట్ పూలపా కృష్ణ,  27వ డివిజన్ ప్రెసిడెంట్ కురిటి శివ, 36వ డివిజన్ గృహ సారథులు, కన్వీనర్లు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *