-వ్యాధి గ్రస్తులకు మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు దాతలు ముందుకు రావాలి..
-క్షయ వ్యాధి నివారణకు రెడ్ క్రాస్ సహకారం అభినందనీయం..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్షయ వ్యాధి గ్రస్తులకు మెరుగైన పోషక విలువలు గల పౌష్టికాహరాన్ని చికిత్సను అందించడం ద్వారా 2025 నాటికి క్షయ వ్యాధిని సమూలంగా రూపు మాపేందుకు స్వచ్చంద సంస్థల సహకారం అవసరమని వ్యాధి నివారణకు ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
ప్రధానమంత్రి నిక్షయ మిత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా క్షయ వ్యాధి నివారణ సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ సంయూక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణంలో క్షయ వ్యాధి గ్రస్తులకు ఐదవ సారి పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ డిల్లీరావు హాజరై వ్యాధి గ్రస్తులకు కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధిని సమూలంగా రూపు మాపేందుకు కేంద్ర రాష్ట్ర ఫ్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి సకాలంలో మెరుగైన వైద్య చికిత్సలు అందించడం ద్వారా 2025 సంవత్సరం నాటికి క్షయ వ్యాధిని సమూలంగా రూపు మాపడమే ప్రభుత్వ లక్ష్య మన్నారు. వ్యాధి గ్రస్తులకు ఉచితంగా మందులను పింపిణీ చేయడంతో పాటు దాతల సహకారంతో ఆరు నెలల పాటు పౌష్టికాహరాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 2,300 మంది క్షయ రోగులను గుర్తించడం జరిగిందన్నారు. వ్యాధి గ్రస్తులకు జిల్లా క్షయ వ్యాధి సంస్థ ఆధ్వర్యంలో 10 టిబి నివారణ కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య చికిత్సను అందజేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్కరికి ప్రభుత్వ సహాయం కింద నెలకు 500 రూపాలయలను చెల్లిస్తున్నామన్నారు. దీనితో పాటు దాతల సహకారంతో 700 రూపాయల విలువగల ఒసోయాబీన్, శనగలు, బెల్లం, కందిపప్పు, బాదంపప్పు, రాగి పిండి, మంచినూనె వంటి పౌష్టికాహరంతో కూడిన కిట్లను అందిస్తున్నామన్నారు. ఇండియాన్ రెడ్‌క్రాస్ సంస్థ సహకారంతో 500 మందికి ఆరు నెలల పాటు పౌష్టికాహరాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఐదవ సారి కిట్లను పంపిణీ చేసిన్నట్లు తెలిపారు. మిగిలిన వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహర కిట్లను అందించేందుకు దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు కోరారు. క్షయ వ్యాది పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలన్నారు. వ్యాధి సోకిన వారు క్రమం తప్పక మందులను వాడడం ద్వారా క్షయ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులను ఆశ్రద్ద చేయకుండా వాడుకోవాలన్నారు. ఊపిరితిత్తులపై ప్రభావం చూపే క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి ప్రాధమిక దశలోనే వైద్య చికిత్స పొందితే త్వరితగతిన కోలుకుని ఆరోగ్యవంతులౌతారని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ జిల్లా అధ్యక్షలు డా. జి. సమరం, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డా. ఉషారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డా. యం సుహాసిని, క్షయ వ్యాధి నివారణ ప్రోగ్రామ్ ఆఫీసర్ యం చిన్నికృష్ణ, రైడ్‌కాస్ర్ సోసైటీ మేనేజర్ సిహెచ్. శ్రీనివాస్‌రావు,డిజాస్టర్ కో`ఆర్డినేటర్ పి. రాధిక, అసిస్టెంట్ మేనేజర్ టి. సునీత తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News