Breaking News

హస్త కళా ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు లేపాక్షి గాంధీ శిల్ప బజార్‌..

-దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా ఉత్పత్తులు ఒకే వేదికపై ప్రదర్శన..
-ఉత్పత్తి దారులచే నేరుగా తక్కువ ధరలకు అమ్మకాలు..
-రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె. సునీత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ వ్యాప్తంగా హస్త కళా కారులచే తయారైన ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి ఉత్పత్తి దారుల చే నేరుగా అమ్మకాలు నిర్వహించడం ద్వారా వినియోగదారులకు తక్కువ ధరలకే హస్త కళా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు లేపాక్షి గాంధీ శిల్ప బజార్‌ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్య ముఖ్య కార్యదర్శి శ్రీమతి కె. సునీత తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ హస్త కళాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పిన్నమనేని పాలిక్లీనిక్‌రోడ్డులోగల సిద్దార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ఆవరణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి లేపాక్షి గాంధీ శిల్ప బజార్‌ను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్య ముఖ్య కార్యదర్శి శ్రీమతి కె. సునీత ప్రారంభించారు. ప్రదర్శనను తిలకించిన అనంతరం ఆమె మట్లాడుతూ ప్రాచీన హస్త కళలు భారతీయ సాంస్కృతి సాంప్రదాయలను బావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రలకు చెందిన హస్త కళాకారులు వారి కళా నైపుణ్యంతో రూపొందించిన హస్త కళ ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి సుమారు 100 పైగా స్టాల్స్‌ ద్వారా ప్రదర్శన అమ్మకాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎంతో వ్యయ ప్రయాసలను తట్టుకుని హస్త కళల పై ఉన్న మక్కువతో నేటికి హస్త కళాకారులు విభిన్న కళా రూపాలకు జీవం పోస్తున్నారన్నారు. అటువంటి వారిని అదరించి ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. హస్త కళా రూపాలకు మార్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు క్రాప్ట్‌ బజార్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం హస్త కళాకారులకు వైఎస్సార్‌ పేరుతో లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు, పద్మశ్రీ అవార్డులను అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్రానికి చెందిన వారే కాక దేశ వ్యాప్తంగా జాతీయ అవార్డులు పొందిన చేతి వృత్తి కళాకారులు వారు తయారు చేసిన ఉత్పత్తులను క్రాప్ట్‌ బజారులో ప్రదర్శిస్తున్నారని ఈ అవకాశాన్ని హస్త కళల అభిమానులు సద్వినియోగం చేసుకుని కళాకారులను ప్రోత్సహించాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ హ్యాండీ క్రాప్స్‌ డెవలప్‌మెంట్‌ కమీషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీమతి ఎన్‌. అపర్ణలక్ష్మి మట్లాడుతూ దేశంలోని కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, రాజస్థాన్‌, మహారాష్ట్ర, బిహార్‌, ఒరిస్సా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, గుజిరాత్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పేరుగాంచిన హస్త కళా ఉత్పత్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహించనునట్లు ఆయన తెలిపారు. ప్రదర్శనలో కలంకారి, ప్రింటింగు, పెయింటింగులు, కొండపల్లి, ఏటికుప్పాక బొమ్మలు, లేసు అల్లికలు, చెక్కతో తయారైన కళాకృతులు, టెర్రకోటపాటరీలు, తాటియాకు వస్తువులు, తివాచీలు, కేన్‌ వస్తువులు, మంగళగిరి చీరాల చేనేత వస్త్రాలు, హైదరాబాద్‌ ముత్యాలు, బ్లాక్‌ మెటల్‌ వస్తువులు, ఉడెన్‌ కట్లరీ వస్తువులు నిర్మల్‌ పెయింటింగ్‌ తో పాటు ఇతర రాష్ట్రలకు చెందిన చికన్‌ ఎంబ్రాయిడరీ, గాజు ఆభరణములు, మధుబని పెయింటంగ్స్‌, బ్లూ పాటరీ వస్తువులు, చిత్రపటాలు, సిల్వర్‌ పిలిగ్రీ, లక్క గాజులు, డోక్రా కేస్టింగ్‌, డ్రై ప్లవర్స్‌ వంటి అనేక కళా రూపాలను ప్రదర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు.
లేపాక్షి ఒఎస్‌డి లక్ష్మినాధ్‌ మట్లాడుతూ లేపాక్షి చైర్‌ పరస్సన్‌ బి. విజయలక్ష్మి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యం. విశ్వ ల పర్యవేక్షణలో నిర్వహించే గాంధీశిల్ప బజార్‌ ఈనెల 26వ తేది వరకు ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సెలవు రోజులలో కూడా కొనసాగుతుందని తెలిపారు.హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన గాంధీశిల్ప బజార్‌ను ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఆయన కోరారు.
గాంధీశిల్ప బజార్‌ ప్రారంభ కార్యక్రమంలో లేపాక్షి మేనేజర్‌ యం సురేష్‌, డిసిహెచ్‌ హెచ్‌పివో సువర్చల , ఎగ్జిబిషన్‌ ఇన్‌ఛార్జి మేనేజర్‌ బి. శైలజ, మార్కెటింగ్‌ మేనేజర్‌ శ్రీథరా చార్యులు, హస్త కళల లేపాక్షి అధికారులు సిబ్బంది టి. రాజశేఖర్‌, చంద్రశేకర్‌, బివి రాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *