Breaking News

మంచి నీటి రిజర్వాయిర్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ 52వ డివిజన్ లోని మల్లికార్జున పేట ఉప్పర వాగు కొండప్రాంతంలో సుమారు 1 కోటి 55 లక్షలు రూపాయల నిధులతో నిర్మించిన 455 కె.ఎల్. సామర్ధ్యము గల మంచి నీటి రిజర్వాయిర్ ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), 52 వ డివిజన్ ఇంచార్జ్ తంగెళ్ల రామచంద్రరావు, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, మరియు విశ్వనాధ రవి, శ్రీశైలం పాలకమండలి సభ్యులు గురుమహంతు మహేష్, ముదిలి ప్రసన్న కుమార్, సంకబత్తుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతిలో ప్రపంచ స్థాయి నేత్ర వైద్య కేంద్రం

-స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పాన్ ఐఐటీ నిపుణులు -అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ సంస్థకు సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *