Breaking News

నూతన పెన్షన్ విధానం రద్దు…పాత పెన్షన్ విధానం ముద్దు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన పెన్షన్ విధానం రద్దు మరియు అందరికి పాత పెన్షన్ విధానం అమలు కొరకు జరిపే పోరాటం లో భాగముగా శుక్రవారం అల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ సిహెచ్ శంకర రావు ఆధ్వర్యములో బ్రహ్మాండమైన ర్యాలీ జరిగింది. ర్యాలీ తదుపరి జరిగిన సమావేశములో మిశ్రా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 2003 లో ఆర్డినెన్సు ద్వారా అమలు లోకి తెచ్చిన నూతన పెన్షన్ విధానం నాటి కమ్యూనిస్టు ల ప్రతిఘటన కారణముగా 2011 వరకు చట్టాన్ని రూపొందించ లేక పోయిందని, తదుపరి బీజేపీ మద్దతు తో కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు ఆమోదించి పిఎఫ్ ఆర్ డి ఏ చట్టాన్ని తెచ్చిందని చెప్పారు. నూతన పెన్షన్ విధానంలో పోరాటాల ద్వారా చని పోయిన వారి కుటుంబ సభ్యులకు ఫామిలీ పెన్షన్, గ్రాట్యుటీ విధానం, పాక్షిక ఉపసంహరణ వంటి విజయాలు సాధించి నప్పటికీ కీలకమైన కనీస గ్యారంటీ పెన్షన్ లేక పోవటం వాళ్ళ రిటైర్ అయిన ఉద్యోగుల సామజిక భద్రతకు విఘాతం ఏర్పడుతుందని తెలియ చెప్పారు. నెలకు 2000 నుండి 5000 లోపు పెన్షన్ వారి పదవీ విరమణ తదుపరి జీవితం కనీస అవసరాలైన ఆహార మరియు ఆరోగ్య అవసరాలను తీర్చలేక పోతుందని విమర్శించారు. నూతన పెన్షన్ విధానం లో ధరల పెరుగుదలను బట్టి డిఆర్ పెరగటం ఉందని అన్నారు. కనుక కార్మికులందరిలో చైతన్యం తెచ్చి నూతన పెన్షన్ విధానము రద్దు అయ్యేవరకు అల్ ఇండియా రైల్వే మేన్స్ ఫెడరేషన్ పోరాటం చేస్తుందని తెలియ చేసారు. దీనిలో భాగముగా దేశములో అన్ని రంగాల ఉద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పోరాటం లో భాగం చేస్తూ ప్రణాళికలు వేస్తున్నామని తెలియ చేసారు. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ సిహెచ్ శంకర రావు మాట్లాడుతూ ఉద్యోగుల పోరాటాలకు తలవొగ్గి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం అమలులోకి తెచ్చిందని, పంజాబ్ ప్రభుత్వం కూడా పాత పెన్షన్ విధానం అమలు చేసే ప్రయత్నం ప్రారంభం చేసిందని, రాబోయే ఎన్నికలలో పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చిన వారికే ఓటు వేయమని పిలుపునిచ్చారు. ఈ సమావేశములో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ , జోనల్ ట్రెజరర్ మురళీధరన్, సహాయ కార్యదర్సులు ఉదయ భాస్కర్, వర ప్రసాద్, సరోజినీ రెడ్డి , విజయవాడ డివిజనల్ సెక్రటరీ జి.ఎన్. శ్రీనివాస రావు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ లీల సికింద్రాబాద్ డివిజనల్ కార్యదర్శి రవీందర్, మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్జీవో సంఘ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు సిఐటియు నాయకులు బాబురావు, ఉమామహేశ్వర రావు, నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు మరియు పెద్ద సంఖ్యలో రైల్వే కార్మికులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *