Breaking News

ఈనెల 5న ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సత్యాగ్రహ నిరాహార దీక్ష… : గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల ఐదో తేదీన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గాంధీనగర్ లోని ధర్నాచౌక్ లో సత్యాగ్రహ నిరాహార దీక్ష చేయనున్నట్లు గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ ప్రకటించారు. సోమవారం భవానీ పురం, ఊర్మిళా నగర్లోని గాంధీ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ ఈ సత్యాగ్రహ నిరాహార దీక్షకు అన్ని పార్టీల వారిని ఆహ్వానిస్తూ వేడుకుంటున్నాను. సత్యగ్రహరీతిలో రాజ్యాంగబద్ధమైన రాజకీయ విధానాలను మాత్రమే మాట్లాడమని ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా మాట్లాడాలని వినయంతో కోరుకుంటున్నానన్నారు. ప్రస్తుతం బిజెపి పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని ప్రధాని మోడీ , బిజెపి పాలకులు ఎంతో అప్రజాస్వామ్యంగా తొలగించారని ఆయన విమర్శించారు. వెంటనే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని గాంధీ నాగరాజన్ డిమాండ్ చేశారు. గతంలో ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని సైతం ఆయన తప్పు పట్టారు. ఇదే తరహాలో ప్రస్తుతం ప్రధాని మోడీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని విమర్శించారు. ప్రధాని మోడీ విధానాలు అదానికి లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి గాని భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం అనే నినాదంతో తాను ఉద్యమ బాట నడుస్తున్నానని ఆయన వివరించారు. ప్రజాస్వామ్యవాదులు రాజకీయాలకు అతీతంగా తన సత్యాగ్రహ నిరాహారదీక్షకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గాంధీ ట్రస్ట్ మహిళా అధ్యక్షురాలు ఆర్.ఎన్. శివరంజని, ట్రస్టు రాష్ట్ర అధ్యక్షురాలు బాపతి భారతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *