Breaking News

నేడు ఆధునీకరించి పున: ప్రారంభించబడిన వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, గాంధీనగర్‌లో సుమారు 89 సంవత్సరాల చరిత్ర కలిగిన వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం (రంగస్థలం) ఆధునీకరించబడి శనివారం పున: ప్రారంభించబడిరది. ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలుగు విశ్వ విద్యాలయం పూర్వ వైస్‌ ఛాన్సలర్‌ ఎస్‌.వి.సత్యనారాయణ కళావేదికను ప్రారంభించి మాట్లాడుతూ కళలు, కళాకారులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విలువతో కూడిన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రంథాలయ ఆధునిక భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రావి శారద ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ గ్రంథాలయం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పరిశోధకులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కోరారు. గ్రంథాలయం అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు మాట్లాడుతూ సాహితీ కళారంగాల వేదిక విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయం అని అన్నారు. హనుమంతరాయ గ్రంథాలయాన్ని ఆధునీకరించి ప్రజలకు మరింత చేరువ చేశామన్నారు. రూ.30 లక్షలతో ఆడిటోరియాన్ని ఆధునీకరించి కళాకారులకు, కళాసంస్థలకు అందుబాటులోకి తీసువచ్చామని తెలిపాయి. గ్రంథాలయానికి, కళావేదికకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. అతి తక్కువ రుసుముతో రంగస్థలం వేదిక కళాకారులకు ఇవ్వడం జరుగుతుందని పాలక వర్గం అన్నారు. కార్యక్రమం అనంతరం అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. స్వాగత నృత్యం అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కామినేని పట్టాభి రామయ్య, వంశీరామరాజు, డాక్టర్‌ కె.ధర్మారావు, నల్లూరి వెంకటేశ్వర్లు, రంగస్థల నటుడు సంజీవి, శ్రీ హనుమంతరాయ గ్రంథాలయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వి. రామ్‌ప్రసాద్‌, కార్యదర్శి నీలం దుర్గారావు, కోశాధికారి మహబూబ్‌ ఆజాం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *