Breaking News

అమరనాథ్ రెడ్డి కి నివాళులు

-ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నమయ్య జిల్లా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతపర్తి మార్కెట్ యార్డులో ఉన్న కాంగ్రెస్ దివంగత నేత అమర్ నాథ్ రెడ్డి విగ్రహానికి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడాన్ని నిరసన తెలిపారు. ఈ సందర్ర్భంగా జంగా గౌతమ్ మాట్లాడుతూ.. అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించి దివంగతులైన అమర్ నాథ్ రెడ్డి అత్మ ఘోషించేలా, ఆయన కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం ద్రోహ పూరిత చర్యగా పేర్కొన్నారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలకు బద్ద వ్యతిరేకమైన బిజేపి లో… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజేపి లో.. కిరణ్ కుమార్ రెడ్డి చేరడం ఆయన స్వార్థ రాజకీయాలకి పరాకాష్ట అని గౌతమ్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలు చేస్తూ బలహీన పడుతుందని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేయడం అనైతికంగా విడ్డూరంగా ఉందని.. కిరణ్ కుమార్ రెడ్డి నీ ముఖ్యమంత్రినీ చేయడమే కాంగ్రెస్ చేసిన తప్పిదమని సోషల్ మీడియా లో ప్రజలు స్పందిస్తున్నారని జంగా గౌతమ్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు డి. రామ్ భూపాల్ రెడ్డి, సాకే శంకర్, ఎస్టీ విభాగం నేత సిద్దయ్య, బీసీ విభాగం నేత రామచంద్ర, చిరంజీవి, nsui నేత తేజ, యూత్ కాంగ్రెస్ నేత సొమ్ శేఖర్ తదితరులు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *