-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రవర్ణ నిరుపేద మహిళల ఆర్థిక చేయూతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈబీసీ నేస్తం రెండో విడతకు సెంట్రల్ నియోజకవర్గం నుంచి 2,593 మందిని అర్హులుగా గుర్తించినట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అగ్రవర్ణాలలోనూ పేదలు ఉన్నారని గుర్తించిన తొలి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రమేనని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర అగ్రవర్ణ సామాజికవర్గాల్లోని పేద మహిళలకు కూడా మేలుచేయాలన్న సత్సంకల్పంతో ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 45 – 60 ఏళ్లలోపు వయసున్న మహిళలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు రూ.45 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. తొలి విడతలో నియోజకవర్గానికి సంబంధించి 1,947 మంది ఖాతాలలో రూ. 2 కోట్ల 92 లక్షల 5 వేలు జమ చేయగా.. రెండో విడత ద్వారా 2,593 మంది ఖాతాలలో రూ. 3 కోట్ల 88 లక్షల 95 వేలు జమ చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా రూ. 6.81 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎక్కడా ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అగ్రవర్ణ పేదల తరపున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News