Breaking News

ఇఫ్తార్‌ దావత్‌ లో జమీల్‌ అహ్మద్‌ బేగ్‌


గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పాత గుంటూరులోని గొలుసు కొండలరావు నగర్‌లో ఎ.కె. సోషల్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షురాలు షేక్‌ ఆషా ఆధ్వర్యంలో బుధవారం ఇఫ్తార్‌ దావత్‌ జరిగింది. ఈ విందులో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ తమకున్న దానిలో ఎంతో కొంత దానం చేయాలని, చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షలు చేయాలన్నారు. సాయంత్రం దువా చేసి ఫలహారాలతో ఉపవాసాన్ని విరమణ చేసినారు. దేశ శ్రేయస్సు కోసం, మానవులందరి క్షేమం కోసం, అందరూ కలిసి మెలిసి సుఖ సంతోషాలతో వుండాలని నమాజ్‌ తర్వాత కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా విందులో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *