గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 22 నాటికి నగరంలో రీ సర్వే 85 శాతం పూర్తీ చేయాలని, అడ్మిన్, ప్లానింగ్ కార్యదర్శులు సమన్వయంతో సర్వే పూర్తి చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పెద్ది రోజా అన్నారు. నగర కమీషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు మంగళవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సిటి ప్లానర్, డిప్యూటీ కమిషనర్ల తో కలిసి రీ సర్వే వేగవంతం, రెవెన్యూ వసూళ్ళ పై ప్లానింగ్, అడ్మిన్, విఆర్ఓ, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరంలో 2,06,650 అసెస్మెంట్లకు గాను 1,25,754 అసెస్మెంట్ల సర్వే పూర్తీ కాబడి, ఇప్పటికీ 60.85 శాతం రీ సర్వే పూర్తి అయిందన్నారు. సచివాలయాల వారిగా తక్కువ శాతం ఉన్న అడ్మిన్, ప్లానింగ్ కార్యదర్శుల వారిగా సమీక్షించి, సమన్వయమే సర్వేలో కీలకమని, అడ్మిన్ లు అసెస్మెంట్ల పూర్తి వివరాలు బుధవారం సాయంత్రానికి ప్లానింగ్ కార్యదర్శులకు ఇవ్వాలన్నారు. ఈ నెల 22 లోపు 85 శాతం సర్వే తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. అనంతరం 5 శాతం పన్ను రాయితీ వసూళ్ళ పై సమీక్షించి, నిర్దేశిత లక్ష్యాల ప్రకారం నెలాఖరుకు రూ.50 కోట్లు వసూళ్లు తప్పనిసరిగా జరగాలన్నారు. పన్ను రాయితీ అవకాశం ప్రారంభం అయిన 5 నుండి ఇప్పటి వరకు రూ.16 కోట్లు వసూళ్లు అయ్యాయని, మిగిలిన రూ.34 కోట్ల వసూళ్ళకు తగిన విధంగా ఆర్.ఓ.లు రానున్న 11 రోజుల్లో ప్రతి రోజు రూ.75 లక్షల చొప్పున వసూళ్ళకు తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసుకోవాలన్నారు. గతంలో నిలిపివేసిన సూపర్ స్ట్రక్చర్ పన్నును విధించాల్సి ఉన్న భవనాలకు వెంటనే విధించాలని, చెరువు పోరంబోకులు, నగరంలోని రోడ్ల మార్జిన్లు, ప్రధాన ప్రాంతాల్లో ఆక్రమణలు మరియు అభ్యంతర పోరంబోకు స్థలాల్లో లేని వాటికే విధించాలన్నారు. సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ 50 శాతంలోపు రీ సర్వే జరిగిన ప్లానింగ్ కార్యదర్శులను సమీక్షించి, పని తీరు మెరుగుపరుచుకోవాలని, నిర్దేశిత లక్ష్యాన్ని అధికమిచాలన్నారు. గుర్తించని గృహాల అసెస్మెంట్ లను ఫారం 16-ఏఏ ద్వారా అప్ లోడ్ చేయాలన్నారు. ఇంచార్జి గా ఉన్న సచివాలయం పరిధిలో కూడా ఇదే పురోగతి కనబరచాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్. శ్రీనివాస్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటి ప్లానర్లు మూర్తి, కోటయ్య, మేనేజర్ శివన్నారాయణ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News