గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ ప్రత్యేకంగా ప్రతి గురువారం నిర్వహించే ఎంప్లాయిస్ గ్రీవెన్స్ లో కమిషనర్ కే నేరుగా అర్జీలు, ఫిర్యాదులు ఇవ్వవచ్చని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం ఆత్మహత్యాయత్నం చేసిన ప్రజారోగ్య విభాగం బదిలీ కార్మికురాలు కనపర్తి విమలను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో కమిషనర్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ భాను ప్రకాష్, ఎస్.ఎస్. సోమశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికురాలు విమల ఆత్మహత్యాయత్నం చేయడం బాదాకరమని, తనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరామన్నారు. కార్మికులు తమ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని, అందుకోసం కమిషనర్ ప్రతి గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారన్నారు. విమలకు ఆరోగ్యం మెరుగవ్వగానే తన విధులకు హాజరు కావచ్చని తెలియచేసామన్నారు.
Prajavartha Online Telugu News