-పాఠశాలల పున ప్రారంభం నాటికి నాడు-నేడు పనులను పూర్తి చేయాలి..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికారులు నిర్థేశించిన లక్ష్యాల సాధనపై అధికారులు దృష్టి పెట్టాలని పాఠశాల పున ప్రారంభంనాటికి నాడు-నేడు పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
జిల్లాలో జగనన్న గృహ నిర్మాణాలు, నాడు-నేడు పనుల ప్రగతి, స్పందన అర్జీల పరిష్కారంపై స్థానిక కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్‌లు సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వం జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశం చేయాలన్నారు. సంకల్పాన్ని నేరవేర్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణాలను నిర్థేశించిన లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టాలన్నారు. గృహ నిర్మాణాల ప్రగతిలో ఎటువంటి అలసత్వం వహించకూడదన్నారు.జగనన్న కాలనీలలో 10,904 గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్థేశించామని ఇప్పటి వరకు 10,839 గృహాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. మరో 123 గృహాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంతవరకు నిర్మాణ పనులను వేకువ వేళలలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీలలో 9,242 మంది లబ్దిదారులకు గాను 7,837 మందికి నీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. 7,838 మందికి విద్యుత్ కనక్షన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, మరో 1404 మందికి గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. జిల్లాలో నిర్థేశించిన 16,347 గృహ నిర్మాణాలకు గాను ఇప్పటికే 10వేలకు పైగా గృహ నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. వివిధ దశలలో ఉన్న 6 వేల గృహాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించుకుని పనులు పూర్తి చేయాలన్నారు. తుది దశ నిర్మాణంలో ఉన్న గృహాలకు చెందిన లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడి నిర్మాణం పూర్తి చేయడంలో వారికి ఎదురవుతున్న సమస్యలను గుర్తించాలన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి సాధ్యమైనంత త్వరలో నిర్మాణాలను పూర్తి చేసి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రూప్ లెవల్ దశలో ఉన్న గృహాలను రూప్ కాస్టింగ్ దశకు తీసుకురావాలన్నారు. గృహ నిర్మాణాలను పూర్తి చేయడంలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పడు తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. లబ్దిదారులతో ప్రతి రోజు పరస్పరం చర్చించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రూప్ లెవల్, రూప్ కాస్టింగ్ దశలో ఉన్న గృహా నిర్మాణాలను పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల లబ్దిదారులకు కేటాయించిన లే అవుట్లలోని గృహా నిర్మాణాలను పూర్తి చేసేలా కార్యచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. నాడు నేడు పథకం కింద చేపట్టిన అదనపు తరగతి గదులు, ప్రహరి గోడలు, మరుగుదొడ్లు, వంట షెడ్లు నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తి చేసి నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్‌రావు, తిరువూరు ఆర్‌డివో వై విప్రసన్నలక్ష్మి, హౌసింగ్ పిడి రజనీ కుమారి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ డి.వెంకట రమణ, హౌసింగ్ డిఇ రవికాంత్, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో`ఆర్డినేటర్ జి. మహేశ్వరరావు, జిల్లాకు చెందిన మండల స్పెషల్ ఆఫీసర్లు యంపిడివోలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News