Breaking News

స్పందన లో నమోదైన ఆర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలి.

-జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన వినతులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్ వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ స్పందన వినతుల పరిష్కారం పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్పందన కార్యక్రమంలో స్వీకరించే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి తగు కారణాలు తెలపాలన్నారు. ఎక్కువగా నమోదవుతున్న వినతులను అంశాలను ప్రాంతాల వారీగా విశ్లేషించుకోని భవిష్యత్తులో సమస్యను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ దరఖాస్థులను సమీక్షించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎక్కువగా నమోదవుతున్న రెవిన్యూ వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మండల స్థాయిలో కూడా నాణ్యతతో అర్జీల పరిష్కారం ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.

స్పందనలో 79 అర్జీలు నమోదు
స్పందనలో ప్రధానంగా రెవిన్యూ 37, పోలీస్ 16, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ 6, విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ 3, పంచాయితీ రాజ్, విద్య, ఉపాధి కల్పన, సర్వే అండ్ సెటిల్మెంట్, పౌర సరఫరాల శాఖలకు రెండేసి అర్జీలు, వ్యవసాయ, ట్రజరీ, వైద్య ఆరోగ్య, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, గ్రంధాలయ, విద్యుత్ శాఖలకు ఒక్కొక్క అర్జీ నమోదయ్యాయి.

ఈ స్పందన కార్యక్రమంలో డిఆర్వో కె. మోహన్ కుమార్, డిఆర్ డీఏ పిడి కె. శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. సుహాసిని, డీపీవో జె.సునీత, వ్యవసాయ శాఖ జెడి ఎస్. నాగమణేమ్మ, హౌసింగ్ పిడి రజిని కుమారి, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ డివి. రమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *