-బాల్యం వివాహాలు మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం.
-చైల్డ్ లైన్-1098 జిల్లా కోఆర్డినేటర్ అరవ.రమేష్ ..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలలందరు ఆనందంగా ఉండే సమాజాన్ని, బాల్య వివాహాలు లేని సమాజాన్ని, అందరూ కలిసి నిర్మించాలని, ఆపదలో ఉన్న బాలలకు అండగా, భరోసా చైల్డ్ లైన్ -1098 ఉంటుందని జిల్లా చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ అరవ.రమేష్ అన్నారు. ది .10/5/2023 న స్థానిక పెజ్జోని పేట లోని RCM దేవాలయం ఆవరణలో విజయవాడ చైల్డ్ లైన్ – 1098, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ వారి ఆధ్వర్యంలో స్థానిక సచివాలయం మహిళా పోలీసు సిబ్బంది , మహిళా శిశు సంక్షేమ శాఖ, సమగ్ర బాలల సంరక్షణ పథకం-DCPU వారి సంయుక్త సహకారంతో సమ్మర్ క్యాంప్ లోని బాలల కొరకు బాలల హక్కుల పరిరక్షణ- అందరి పాత్ర అనే అంశంపై సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రంలోని ముఖ్య అతిధిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జాన్సన్ మాట్లాడుతూ “ఆపదలో ఉన్న బాలల రక్షణకు చైల్డ్ లైన్-1098 టీం చేస్తున్న సేవలను అభినందించారు. అలాగే చిన్న పిల్లలకు అవగాహన లేక తల్లిదండ్రులు 18 సం|| లోపు ఆడపిల్లలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం అని, బాలలు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని కోరారు . అలాగే బాలలు ఆపదలో ఉoటే వెంటనే CHILDLINE -1098 లేదా పోలీస్ 100 లేదా 112 కి లేదా ఉమెన్ హెల్ప్ లైన్ 181 ఫోన్ చేసి తెలపాలని కోరారు.
చైల్డ్ లైన్-1098 జిల్లా కోఆర్టినేటర్ అరవ· రమేష్ మాట్లాడుతూ కరోనా తరువాత -బాలలు స్థితి – పరిస్థితులు మారాయిని అన్నారు. కొంత మంది అవగాహనా – చైతన్యం లేక సెల్ ఫోన్ కు మరియు మత్తు పదార్థాలకు బానిసలు అయ్యరని మరియు కొంతమంది తల్లి దండ్రులు పిల్లలను బడులకు పంపడంలేదని, బాలకార్మికులుగా మారుతున్నారు ఆని, బాలలందరు చదువుకొని ఉన్నతస్థితికి రావలని కోరారు.
మరొక ముఖ్య అతిథి స్థానిక RCM చర్చి డైరక్టర్ ఫాదర్. జేమ్స్ మాట్లాడుతూ బాలలందరు సెల్ ఫోన్లు వాడే అలవాటును తగించలని, అమ్మానాన్నలు చెప్పిన మాటలు విని మంచి భవిష్యత్త్తు లోకి రావాలని కోరారు. ప్రతి ఒక్కరు కలలు కని వాటిని ఋజువు చేసుకోనుటకు కష్టపడి సాధించాలని కోరారు. సమాజం లో బాలల హక్కుల పరిరక్షణకై చైల్డ్ లైన్ చేస్తున్న కృషిని అభినoదిచారు.
BIRDS NGO సంస్థ సెక్రటరీ K. ప్రకాష్ కుమార్ విశిష్ట అతిది మాట్లాడుతూ బాలలు చదువు ద్వారానే జీవితంలో ఉన్నస్థితికి చేరుకో గలం కాబట్టి ఎన్ని అవరోధలు వచ్చినా బాలాలందరు చదువుకువాలని కోరారు. చక్కని పాటలు పాడి వినిపించారు.
ఈ కార్య్రమంలో CHILDLINE center కోఆర్డి నేటర్ p.నాగరాజు టీమ్ సభ్యులు, అబ్రహం, ప్రవీణ్, స్వరూప,మరియు స్థానిక సచివాలయం మహిళా పోలీసులు మెర్సీ, క్యాంప్ ఇంఛార్జి బ్రదర్. అశోక్ , విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ AHTU బాలల అక్రమరవాణా యూనిట్ నుండి శ్యామ్, తదితరులు మరియు స్థానిక బాలలు 100 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ నిర్మూలనకై పోస్టరును ఆవిష్కరించారు.బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చైతన్య గీతాలు వినిపించి బాలలకు అభినందనలు తెలిపారు
Prajavartha Online Telugu News