Breaking News

నిరుపేదలకు దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా చేయూత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ నిరుపేద కుటుంబాలకు చెందిన ఐనంపూడి సరస్వతి, గణపవరపు వేణు లకు జీవనోపాధి కొరకు తగు సహాయం చేయాలని ఎన్టీఆర్ జిల్లా వక్ప్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ షేక్ సుభాని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్  దృష్టికి తీసుకురాగా బుధవారం నాడు వారికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15వేల రూపాయలు విలువ చేసే తోపుడు బండి, 25వేల రూపాయల విలువ చేసే ఇస్త్రీ బండిని రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారి చేతుల మీదుగా ట్రస్ట్ సిబ్బంది అందజేశారు.ఈ సందర్భంలో కడియాల బుచ్చుబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకుని నిరుపేదలకు అండగా నిలవాలనే ఆశయాలకు అనుగుణంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు ట్రస్ట్ ఛైర్మెన్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వక్ప్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ షేక్ సుభాని, మార్కెట్ యార్డ్ డైరక్టర్ విజయలక్ష్మి,మాజీ కార్పొరేటర్ పల్లెం రవి,వైస్సార్సీపీ నాయకులు NS రాజు,దండమూడి రాజేష్,బాష,రఫీ,ఉమ్మడి ధనరాజ,సొంగా రాజ్ కమల్,బచ్చు మురళి,ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కొరివి చైతన్య,ఎన్టీఆర్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు చిమటా సాంబశివరావు,దుర్గ గుడి పాలకమండలి మెంబెర్ బచ్చు మాదవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *